IRCTC Goa: 4 రోజుల్లో గోవా టూర్‌.. హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్‌ జర్నీ..

|

May 29, 2024 | 8:00 AM

గోవా ట్రిప్‌ వెయ్యాలని చాలా మంది ఆశపడుతుంటారు. ముఖ్యంగా యువత ఒక్కసారైనా గోవా ట్రిప్‌ వెళ్లాలని ఆశిస్తుంటారు. అయితే బస్సులో, ట్రైన్‌లో గోవా టూర్ ప్లాన్‌ చేస్తే కాస్త కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పొచ్చు. మీలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ ఓ అదిరిపోయే టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్‌ జర్నీలో గోవా చుట్టేసేలా...

IRCTC Goa: 4 రోజుల్లో గోవా టూర్‌.. హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్‌ జర్నీ..
Goa Trip
Follow us on

గోవా ట్రిప్‌ వెయ్యాలని చాలా మంది ఆశపడుతుంటారు. ముఖ్యంగా యువత ఒక్కసారైనా గోవా ట్రిప్‌ వెళ్లాలని ఆశిస్తుంటారు. అయితే బస్సులో, ట్రైన్‌లో గోవా టూర్ ప్లాన్‌ చేస్తే కాస్త కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పొచ్చు. మీలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ ఓ అదిరిపోయే టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్‌ జర్నీలో గోవా చుట్టేసేలా ఈ టూర్‌ ప్లాన్‌ను డిజైన్‌ చేశారు. ‘GOAN DELIGHT’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్‌ చేస్తున్నారు. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తక్కువ సమయంలో ఎలాంటి రిస్క్‌ లేకుండా గోవా టూర్‌ చుట్టేసేలా ఈ టూర్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. టూర్‌ ప్యాకేజీ ప్రస్తుతం ఆగస్టు 23వ తేదీన అందుబాటులో ఉంది. టూర్‌ ప్లాన్‌ మొత్తం 3 రాత్రులు, 4 రోజుల పాటు టూర్‌ ప్యాకేజీ ఉంటుంది. ఒకవేళ ఆగస్టులో మిస్‌ అయితే సెప్టెంబర్‌లో కూడా టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయో ఇప్పుడు చూద్దాం..

టూర్ ఇలా సాగుతుంది..

* తొలి రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి టూర్‌ ప్రారంభమవుతుంది. 12.30 గంటలకు గోవాకు చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో చెకిన్‌ అవుతారు.

* రెండో రోజు ఉదయం సౌత్‌ గోవా పర్యటన ఉంటుంది. ఇందులో భాగంగా ఓల్డ్ గోవా చర్చి, వాక్స్ వరల్డ్‌ మ్యూజియం, మంగేషి ఆలయం, మిర్‌మర్‌ బీచ్‌ సందర్శన ఉంటుంది. మండోవి నదిలో బోట్ క్రూజ్ జర్నీ ఉంటుంది.

* మూడో రోజు నార్త్‌ గోవా సందర్శన ఉంటుంది. ఇందులో భాగంగా అగాడా ఫోర్ట్‌, కండోలియం బీచ్, బాగా బీచ్ లో స్పోర్ట్ ఈవెంట్స్‌లో పాల్గొంటారు. అంజునా బీచ్, వగాటర్ బీట్, చాపోరా బీచ్ సందర్శన తర్వాత తిరిగి హోటల్ కి వెళ్తారు.

* నాల్గవ రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత హోటల్‌ నుంచి చెక్‌ అవుట్‌ అయి.. తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.25 గంటలకు ఎయిర్‌ పోర్ట్‌ నుంచి రిటర్న్‌ జర్నీ ఉంటుంది. మధ్యాహ్నం 3.55 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడం టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర వివరాలు..

ప్యాకేజీ ధర విషయానికొస్తే.. సింగిల్‌ అక్యూపెన్సీకి రూ. 24,260గా, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 19245, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 18935గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు ప్రత్యేకంగా టికెట్‌ ధరలను నిర్ణయించారు. టూర్‌ ప్యాకేజీలో భాగంగా హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..