Shirdi Tour: షిరిడీ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? 3 రోజుల్లో వెళ్లి రావొచ్చు, బడ్జెట్‌లోనే..

|

May 12, 2024 | 8:38 PM

సమ్మర్ హాలీడేస్‌లో షిరిడీ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసేలా ఈ టూర్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆపరేట్‌ అయ్యే ఈ టూర్‌ మొత్తం నాలుగు పగళ్లు మూడు రాత్రులుగా సాగుతుంది. ఇంతకీ ఈ టూర్‌ ఎప్పుడు అందుబాటులో ఉంది.? ప్యాకేజీ ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

Shirdi Tour: షిరిడీ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? 3 రోజుల్లో వెళ్లి రావొచ్చు, బడ్జెట్‌లోనే..
Irctc
Follow us on

సమ్మర్ హాలీడేస్‌లో షిరిడీ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసేలా ఈ టూర్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆపరేట్‌ అయ్యే ఈ టూర్‌ మొత్తం నాలుగు పగళ్లు మూడు రాత్రులుగా సాగుతుంది. ఇంతకీ ఈ టూర్‌ ఎప్పుడు అందుబాటులో ఉంది.? ప్యాకేజీ ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మే 17వ తేదీన ఈ టూర్‌ అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న వారు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు..

ప్రయాణం ఇలా సాగుతుంది..

* తొలి రోజు సాయంత్రం 6.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌ను ప్రయాణం ప్రారంభమవుతుంది. రైలు నెంబర్‌ 17064, అజంతా ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా ప్రయాణం సాగుతుంది.

* రెండో రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్‌ రైల్వే స్టేషన్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన షిరిడీకి చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో చెక్‌ ఇన్‌ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీలో షాపింప్‌ చేసుకోవచ్చు. రాత్రి అక్కడే బస ఉంటుంది.

* ఇక మూడో రోజు షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. త్రయంబకేశ్వర్, పంచవతి దర్శనం ఉంటుంది. తిరిగి నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.

* నాలుగో రోజు ఉదయం 9.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర వివరాలు ఇలా ఉన్నాయి..

ధర విషయానికొస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ. 9320గా, డబుల్ షేరింగ్‌కు రూ. 7960 ధరగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఇదే ప్యాకేజీ గత నెలలో ధర ఎక్కువగా ఉండగా ప్రస్తుతం తగ్గించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..