IRCTC Ayodhya Tour: అయోధ్య రామ మందిరం సహా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంత్రాలను దర్శించుకునే వీలుతో ఐఆర్‌సీటిసీ సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ లో అలహాబాద్, అయోధ్య, లక్నో, సారనాథ్, వారణాసి వంటి ప్రముఖ ప్రాంతాలను సందర్శించవచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శ్రీరాముని భక్తుల కోసం 5 రాత్రులు, ఆరు పగళ్లు తో ఎయిర్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
IRCTC వివరాల ప్రకారం.. ఈ పర్యటన 19వ తేదీ ఫిబ్రవరి 2022న ప్రారంభమై 24వ తేదీ ఫిబ్రవరి 2022న ముగుస్తుంది. పర్యాటకులు సారనాథ్, కాశీ విశ్వనాథ దేవాలయం, అన్నపూర్ణ దేవాలయం, గంగా ఆరతి, త్రివేణీ సంగమం, అలహాబాద్ కోట సహా వివిధ ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శిస్తారు. అయోధ్య, రామ జన్మభూమి, లక్ష్మణ్ ఘాట్, కాలా రామ్ టెంపుల్, కనక్ భవన్ టెంపుల్ రూమి దర్వాజా, ఆర్ట్ గ్యాలరీ, అంబేద్కర్ మెమోరియల్ పార్క్ ఘంటా ఘర్ మొదలైన ప్రముఖ ప్రాంతాలను కూడా టూర్ ప్యాకేజీలో భాగంగా సందర్శించే వీలుకల్పించారు.
19 ఫిబ్రవరి 2021న కోల్‌కతా విమానాశ్రయం నుండి ఉదయం 11.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు వారణాసి విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరిగి 24 ఫిబ్రవరి 2021న లక్నో విమానాశ్రయం నుండి ఉదయం 08.55 బయలుదేరి ఉదయం 10.35 కి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంతారు.
సింగిల్ ఆక్యుపెన్సీ కేటగిరీకి ఒక్కొక్కరికి రూ. 30,120, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 22,580, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 20,725, 5 ఏళ్ల నుంచి 11 ఏళ్లు పిల్లలకు రూ.16,245, 2 నుంచి 4 ఏళ్ల చిన్నారులకు రూ. 13,640లుగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణ భీమా కూడా కల్పిస్తున్నారు.