IRCTC Tour: హైదరాబాద్ టు కోనసీమ.. స్వర్గానికి షార్ట్‌కట్!.. ఐఆర్సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ

కోనసీమలోని ప్రముఖ ప్రాంతాలు చూడాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 'గోదావరి టెంపుల్ టూర్' పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఇదే నెలలో హైదరాబాద్ నుంచి జర్నీ ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కోనసీమలోని ప్రముఖ ఆలయాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు చూడవచ్చు. అంతర్వేది, అన్నవరం, ద్రాక్షరామం ఆలయాలు దర్శించుకోవచ్చు.

IRCTC Tour: హైదరాబాద్ టు కోనసీమ.. స్వర్గానికి షార్ట్‌కట్!.. ఐఆర్సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ
Konaseema Irctc Tour

Updated on: Nov 18, 2025 | 9:29 PM

కోనసీమలోని ప్రముఖ ప్రాంతాలు, ఆలయాలు చూడాలనుకుంటున్నారా? అయితే, ఐఆర్సీటీసీ టూరిజం మీకోసం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. “గోదావరి టెంపుల్ టూర్” పేరుతో ఈ యాత్ర ఆపరేట్ అవుతుంది. ఇదే నెలలో హైదరాబాద్ నుంచి జర్నీ మొదలవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా అంతర్వేది, అన్నవరం, ద్రాక్షరామం లాంటి ప్రసిద్ధ ఆలయాలు దర్శించుకునే అవకాశం ఉంది.

టూర్ ప్యాకేజీ వివరాలు, షెడ్యూల్

టూర్ పేరు: గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ

ప్రారంభ తేదీ: 21, నవంబర్, 2025 (ఈ తేదీ మిస్ అయితే, మరో తేదీలో ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు.)

ప్రయాణ వ్యవధి: 3 రాత్రులు, 4 రోజులు

బుకింగ్: https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.

ప్రయాణ దినచర్య (Day-wise Itinerary):

మొదటి రోజు (ప్రయాణం): లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8.30 గంటలకు, సికింద్రాబాద్ నుంచి 9.15 గంటలకు గౌతమి ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 12738) బయల్దేరుతుంది. రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది.

రెండో రోజు (రాజమండ్రి, అన్నవరం): ఉదయం 4.38 గంటలకు రాజమండ్రి స్టేషన్ చేరుకుంటారు. హోటల్ కు వెళ్ళిన తర్వాత, అన్నవరం దర్శనం పూర్తవుతుంది. ఆ తర్వాత గోదావరి ఘాట్, ఇస్కాన్ టెంపుల్ చూస్తారు. రాత్రి రాజమండ్రిలోనే బస ఉంటుంది.

మూడో రోజు (కోనసీమ ఆలయాలు): ఉదయం అంతర్వేదికి ప్రయాణం ఉంటుంది. అక్కడ నరసింహ్మా స్వామి దర్శనం, బీచ్ సందర్శన ఉంటాయి. అక్కడి నుండి బాలాజీ టెంపుల్, అప్పన్నపల్లి, విఘ్నేశ్వరం టెంపుల్, ఐనవల్లి చూస్తారు. సాయంత్రం ద్రాక్షరామం దర్శనం ఉంటుంది. రాత్రి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

నాల్గో రోజు : ఉదయం 4.35 నిమిషాలకు సికింద్రాబాద్, 5.55 నిమిషాలకు లింగంపల్లికి చేరుకోవటంతో ఈ టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు (ఒక వ్యక్తికి)

కంఫర్ట్ క్లాస్:

సింగిల్ షేరింగ్ కు రూ. 15,340

డబుల్ షేరింగ్ కు రూ. 8,940

ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7,170

స్టాండర్డ్ క్లాస్:

సింగిల్ షేరింగ్ కు రూ. 13,800

డబుల్ షేరింగ్ కు రూ. 7,400

ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5,630

సందేహాలు ఉంటే: మీరు 8287932229 / 8287932228 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.