Lakshadweep Tour Package: మోదీ మెచ్చిన లక్షద్వీప్‌.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలో తెలుసా?

|

Jan 08, 2024 | 9:41 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. సాహసాలు ఇష్టపడేవారు లక్షద్వీప్‌లో పర్యటించాలని, లక్షదీవుల అందాలు తనకు ఎంతో నచ్చాయంటూ మోదీ ట్వీట్ చేశారు. మోదీ పర్యటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూసిన పలువురు నెటిజన్లు మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్‌కు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రధాని మోదీ లక్షదీవుల పర్యటపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద..

Lakshadweep Tour Package: మోదీ మెచ్చిన లక్షద్వీప్‌.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలో తెలుసా?
Lakshadweep Tour
Follow us on

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. సాహసాలు ఇష్టపడేవారు లక్షద్వీప్‌లో పర్యటించాలని, లక్షదీవుల అందాలు తనకు ఎంతో నచ్చాయంటూ మోదీ ట్వీట్ చేశారు. మోదీ పర్యటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూసిన పలువురు నెటిజన్లు మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్‌కు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రధాని మోదీ లక్షదీవుల పర్యటపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదాస్పదంగా మారింది. ఆ వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసింది. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, సచిన్ తెందూల్కర్ వంటి ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. తాజా చర్చల్లో నిలిచిన లక్షద్వీప్ అసలింతకీ ఎక్కడ ఉంది? అక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

లక్షద్వీప్‌ ఎక్కడ ఉంది?

భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌. ఇది 36 దీవుల సమూహం. ఇక్కడి వెళ్లడానికి నేరుగా రోడ్డు, రైలు మార్గాలు లేవు. అక్కడికి వెళ్లాలంటే వాయు మార్గం లేదా జలమార్గంలో మాత్రమే వెళ్లాలి. కేరళ తీరానికి సుమారు 300 కి.మీ. దూరంలో లక్షద్వీప్ ఉంటుంది. అరేబియా సముద్రంలోని ఈ దీవులు ఉన్నాయి. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా కేరళలోని కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి. కొచ్చి నుంచి ఓడలు, బోట్లు, విమానాలు, హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి కొచ్చికి నిత్యం విమాన సర్వీసులు నడుస్తున్నాయి. కొచ్చికి వెళ్లడానికి నెల రోజుల ముందు ప్లాన్ చేసుకోవాలి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి అక్కడికి వెళ్లడానికి విమాన టిక్కెట్ ధర రూ. 4,500. లక్షద్వీప్‌లో ఒకేఒక్క విమానాశ్రయం ఉంది. అక్కడి ‘అగత్తి’లో ఈ విమానాశ్రయం ఉంది. అదే కొచ్చి నుంచి అగత్తికి వెళ్లడానికి విమాన టిక్కెట్ ధర రూ. 5,500 వరకు ఉంటుంది. కోచీ చేరుకోవడానికి మాత్రం రైలు మార్గం ఉంది. రైలు మార్గంలో ఎర్నాకులం టౌన్ కానీ ఎర్నాకులం జంక్షన్ రైల్వే స్టేష‌న్‌కు కానీ చేరుకోవచ్చు. హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్(నాంపల్లి) నుంచి కేరళలోని ఎర్నాకులం జంక్షన్‌కు నిత్యం శబరి ఎక్స్‌ప్రెస్ (17230) నడుస్తుంది. సికింద్రాబాద్‌ నుంచి కొచ్చికి చేరుకోవడానికి 23:35 గంటల సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి

విజయవాడ నుంచి దాదాపు 7 రైళ్లు కేరళకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కేరళ ఎక్స్‌ప్రెస్, అలప్పీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు రోజూ ఉంటాయి. విశాఖపట్నం నుంచి కేరళకు దాదాపు 4 రైళ్లు ఉన్నాయి. అలప్పీ-బొకారో ఎక్స్‌ప్రెస్ నిత్యం కేరళకు అందుబాటులో ఉంటుంది. ఇక కేరళలోని కొచ్చి చేరుకోవడానికి రోడ్డు మార్గం కూడా ఉంది. కొచ్చి ఎన్‌హెచ్ 47 రహదారి ముంబయి, కోజికోడ్, మంగళూరు, బెంగళూరు, చెన్నై, గోవాలను కలుపుతుంది. ఈ నగరాల నుంచి అక్కడికి రోడ్డు మార్గాన వెళ్లొచ్చు. అక్కడి నుంచి అన్నింటి కంటే ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైనా లక్షద్వీప్‌ దీవులకు వెళ్లాలంటే ముందుగా అక్కడి అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొచ్చి నుంచి లక్షద్వీప్‌కు వెళ్లడానికి అక్కడి అధికారుల నుంచి అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ అధికారులు, ఆర్మీ బలగాలు, వారి కుటుంబ సభ్యులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.