
డెవిల్ పెప్పర్: ఇండియన్ స్నేక్‌రూట్ అని కూడా పిలువబడే డెవిల్ పెప్పర్ మొక్కలు పాములను దూరంగా ఉంచడానికి సహజ వికర్షకంగా పనిచేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పాముల వికర్షక మూలిక అంటారు.. దీని వేరు నుండి వెలువడే విచిత్రమైన వాసన పాములను దూరంగా ఉంచుతుంది.

గరుడ వృక్షం: ఇది ఎత్తుగా పెరిగే ఒక చెట్టు. దీనిని ఇంటి చుట్టూ పెంచితే పాములను శాశ్వతంగా దూరంగా ఉంచవచ్చు. దీని పేరు సూచించినట్లుగా, ఇది పాముల నుండి రక్షణ కల్పిస్తుంది. దీని ఉనికి పాములు రాకుండా నిరోధిస్తుంది. దీని వేర్లు ఇంటి తలుపుకు కట్టి ఉంటే కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

పామురూట్: పామురూట్ దీనినే సర్పంద అని కూడా అంటారు. ఇది ఒక ఔషధ మొక్క. సర్పగంధ మొక్క వాసన చాలా వింతగా ఉంటుంది. దీని వేర్లు పసుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి. ఆకులు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పాములు దీని వాసనను ఇష్టపడవు. అందుకే, ఈ మొక్కను ఇంటి దగ్గర నాటితే పాములు పారిపోతాయని అంటారు.

కాక్టస్: కాక్టస్ అనేది ముళ్ళ మొక్క. పాములు అలాంటి మొక్కలకు దూరంగా ఉంటాయి. ఇండోర్ మొక్కలలో ఒకటైన కాక్టస్ పాములను ఇంట్లోకి రాకుండా చేస్తుంది. పాములకు సున్నితమైన చర్మం ఉండటం వల్ల.. ఇలాంటి ముళ్ల మొక్కల దగ్గర సంచరించడానికి భయపడతాయి.. బాల్కనీ, విండో వంటి ప్రదేశాలలో కాక్టస్ నాటవచ్చు.

స్నేక్ ప్లాంట్: ఇది అందరికీ తెలిసిన ఒక అలంకార మొక్క. దీనిని మదర్ ఇన్ లాస్ టంగ్ అని కూడా అంటారు. దీనికి పొడవైన వేరు కాండం, గట్టి ఆకులు ఉంటాయి. స్నేక్ ప్లాంట్ ఆకులు పదునుగా ఉంటాయి. దాని రసాయన కూర్పు పాములను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. పాములు ఈ మొక్కలోని రసాయనాలను తట్టుకోలేవు. కాబట్టి అవి దూరంగా ఉంటాయి.