Tips to Cure Dark Circles: సరిగా నిద్రపోకపోవడం, ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం, మద్యపానం లాంటి చెడు అలవాట్ల కారణంగా చాలామంది పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యల్లో కళ్లు ఉబ్బడం, కళ్ల కింద నల్లటి వలయాలు కూడా ఒకటి. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. నిద్రలేమి, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, మద్యపానం వల్ల ఇలా జరుగుతుంది. అదే సమయంలో ఫోన్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల కూడా కళ్ళు దెబ్బతింటాయి. కళ్ల కింద ఉబ్బరం, నల్లటి వలయాలు కనిపించడం వల్ల వయస్సు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే.. ఇలాంటి సమస్యను మీరు కూడా ఎదుర్కొంటుంటే.. చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని చిట్కాలను పాటిస్తే.. కళ్ల కింద ఉబ్బరం, నల్లటి వలయాలను వదిలించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
కళ్ల కింద వాపు రావడానికి కారణం ఏమిటి?..
మన వయస్సు పెరిగేకొద్దీ, మన కళ్ళ చుట్టూ ఉన్న చర్మం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇంకా చర్మం సాగిపోవడం లాంటి సమస్య కూడా ప్రారంభమవుతుంది. ఈ కారణంగా, కళ్ల కింద వాపు కనిపించడం ప్రారంభమవుతుంది. దానితో పాటు కళ్ల చుట్టూ నలుపు పెరుగుతుంది.
కళ్ల కింద వాపును నివారించే మార్గాలు..
కోల్డ్ కంప్రెస్: శరీరంలోని ఏ భాగంలోనైనా వాపు వస్తుంటే దానిని తగ్గించడానికి మీరు కోల్డ్ కంప్రెస్‌ని ఉపయోగించవచ్చు. కళ్ల కింద నలుపు సమస్య ఉన్నవారు దీన్ని ఉపయోగిస్తే.. కళ్ళు గులాబీ రంగులోకి మారిపోతాయి. ఏదైనా ఇన్ఫెక్షన్, నొప్పి ఉంటే.. దీని కోసం ఓ స్టీల్ చెంచాను చల్లగా చేసి కళ్లపై అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కళ్ల వాపు, నలుపు పోతాయి.
కళ్ళపై చల్లని గ్రీన్ టీ-బగ్‌లను అప్లై చేయండి: గ్రీన్ టీ తాయారు చేసుకొని తాగి.. ఆ బ్యాగ్‌లను ఫ్రిజ్‌లో చల్లబరిచి కళ్లపై అప్లై చేసుకోండి.. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుతాయి. ఇంకా కళ్లు ఉబ్బడం, వాపు లాంటివి కూడా తగ్గుతాయి.
తల పైకి ఉంచి నిద్రపోండి: తలని కొద్దిగా పైన ఉంచి నిద్రించడం వల్ల కళ్ల వాపు సమస్య దూరమవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..