
శీతాకాలం మొదలైంది. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తాయి. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటమే అందుకు కారణం. దీనివల్ల చర్మంలోని తేమ త్వరగా ఆరిపోతుంది. ఇది చర్మ కాంతిని కూడా తగ్గిస్తుంది. పొడి చర్మ సమస్య కారణంగా, ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడానికి ఈ కింది సహజ ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
శీతాకాలంలో చర్మం తేమను కాపాడటానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. పడుకునే ముందు ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
తేనె ఒక సహజ మాయిశ్చరైజర్. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖం కడుక్కోవడానికి 10-15 నిమిషాల ముందు దీన్ని మీ ముఖంపై అప్లై చేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది.
అలోవెరా జెల్ మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం తేమగా మారి, పొడిబారకుండా ఉంటుంది.
శీతాకాలంలో మీ ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేయడం వల్ల మీ చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది.
శీతాకాలంలో మీ చర్మానికి ఎక్కువ మాయిశ్చరైజర్ అవసరం. రోజుకు కనీసం రెండుసార్లు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. షియా బటర్, గ్లిజరిన్ లేదా హైలురానిక్ యాసిడ్ వంటి పదార్థాలను కలిగి ఉన్న మాయిశ్చరైజర్లు మంచివి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.