Hypothyroidism: ఈ అలవాట్లు మానుకోపోతే.. థైరాయిడ్ రావడం ఖాయం!

|

Oct 29, 2024 | 5:05 PM

థైరాయిడ్ అనేది ఒక దీర్ఘకాకలికమైన వ్యాధి. కాబట్టి థైరాయిడ్ రాక ముందు నుంచే సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. థైరాయిడ్ వచ్చిన వారు సన్నగా లేదంటే లావుగా ఉంటారు. థైరాయిడ్ ఒక్కసారి వచ్చినా తగ్గించుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు చెప్పే ఈ అలవాట్లకు దూరంగా ఉండండి..

Hypothyroidism: ఈ అలవాట్లు మానుకోపోతే.. థైరాయిడ్ రావడం ఖాయం!
Hypothyroidism
Follow us on

థైరాయిడ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. థైరాయిడ్ గురించి ఇంకా తెలియని వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. థైరాయిడ్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం కష్టపడాలే కానీ.. థైరాయిడ్ మాత్రం తగ్గదు. కేవలం చికిత్స తీసుకుంటూ మాత్రమే కంట్రోల్ చేయగలం. మనం చేసే కొన్ని రకాల తప్పుల వలనే థైరాయిడ్ అనేది వస్తుంది. థైరాయిడ్ వచ్చే ముందు కూడా కొన్ని రకాల లక్షణాలు అనేవి కనిపిస్తాయి. ముందుగా వాటిని గుర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ముందుగానే జాగ్రత్త పడొచ్చు. లేదంటే ఇది దీర్ఘకాలిక వ్యాధిలా మారే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ అనేది మన గొంతు వద్ద కనిపిస్తుంది. ఇది మెటబాలిజం ఉత్పత్తికి తోడ్పడుతుంది. హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్రంథి సరిగా పని చేయకపోతే.. థైరాయిడ్ అనేది వస్తుంది. మరి థైరాయిడ్ వచ్చేందుకు మనం చేసే తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువగా ఒత్తిడి తీసుకోవడం:

ఒత్తిడికి ఎక్కువగా గురి కావడం వలన థైరాయిడ్ సమస్య అనేది వస్తుంది. ఎక్కువగా స్ట్రెస్‌కి గురయ్యే వారిలో థైరాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పలు పరిశోధనలు తేల్చాయి.

డయాబెటీస్:

డయాబెటీస్‌తో బాధ పడేవారికి కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ లెవల్స్ థైరాయిడ్‌ను ప్రభావితం చేస్తుంది. దీంతో ఇది హైపోథైరాయిడిజంకు దారి తీస్తుంది. అంతే కాకుండా మెటబాలిక్ రేటుపై కూడా ఎఫెక్ట్ పడుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రాసెస్ ఫుడ్స్:

ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలను అధికంగా తినే వారిలో కూడా థైరాయిడ్ అనేది ఎక్కువగా ఎటాక్ చేస్తుంది. ముఖ్యంగా ప్రాసెస్ ఫుడ్స్.. థైరాయిడ్స్‌పై ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండటం బెటర్.

నిద్ర లేకపోవడం:

సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా థైరాయిడ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పలు పరిశోధనలు రుజువు చేశాయి. నిద్ర సరిగ్గా లేకపోతే థైరాయిడ్ లెవల్స్ అనేవి నియంత్రణలో ఉండవు. దీని వలన హైపర్ థైరాయిడైజమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.