Thyroid Diet: థైరాయిడ్ రోగులు తప్పక తీసుకోవల్సిన ఆహారాలు ఇవే..!

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఆహారంలో తప్పక కొన్ని మార్పులు చేసుకోవాలి. థైరాయిడ్ అనేది శరీర శక్తి స్థాయిలు, జీర్ణక్రియ, ఉష్ణోగ్రత, మానసిక స్థితి, హృదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే ఓ హార్మోన్. ఇది శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపితే బద్ధకంగా, బలహీనంగా మారుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉంటే ఈ కింది..

Thyroid Diet: థైరాయిడ్ రోగులు తప్పక తీసుకోవల్సిన ఆహారాలు ఇవే..!
Thyroid Diet

Updated on: Jun 03, 2025 | 9:05 PM

థైరాయిడ్.. ఇదొక ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్య. సకాలంలో గుర్తిస్తే వైద్యపరంగా చికిత్స చేయవచ్చు. కానీ ఆలసత్వం చేస్తే అది క్యాన్సర్‌గా మారే ప్రమాదం లేకపోలేదు. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఆహారంలో తప్పక కొన్ని మార్పులు చేసుకోవాలి. థైరాయిడ్ అనేది శరీర శక్తి స్థాయిలు, జీర్ణక్రియ, ఉష్ణోగ్రత, మానసిక స్థితి, హృదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే ఓ హార్మోన్. ఇది శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపితే బద్ధకంగా, బలహీనంగా మారుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉంటే ఈ కింది 6 ఆహారాలు తప్పక తీసుకోవాలి..

థైరాయిడ్ ఉన్నవారు ఏమి తినాలి?

సాల్టెడ్ నట్స్

బ్రెజిల్ నట్స్, మకాడమియా నట్స్, హాజెల్ నట్స్.. వీటిల్లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన థైరాయిడ్ పనితీరుకు ఉపయోగపడుతుంది. వీటన్నింటినీ కలిపి రోజంతా స్నాక్స్ మాదిరి ప్యాకెట్‌లో నిల్వ చేసి.. అప్పుడప్పుడు తీసుకోవచ్చు.

కాల్చిన చేపలు

చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేటర్‌ తగ్గించడంలో సహాయపడతాయి. కాల్చిన సాల్మన్, కాడ్, సీ బాస్, హాడాక్, పెర్చ్‌లను భోజనంలో తినవచ్చు.

ఇవి కూడా చదవండి

పాల ఉత్పత్తులు

పెరుగు, ఐస్ క్రీం, పాలు వంటి పాల ఉత్పత్తులలో మంచి మొత్తంలో అయోడిన్ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథులు పెరగకుండా నిరోధించడానికి అయోడిన్ అవసరం.

గుడ్లు

గుడ్లలో సెలీనియం, అయోడిన్ రెండూ మంచి మొత్తంలో ఉంటాయి. గరిష్ట ఆరోగ్య ప్రయోజనాల కోసం మొత్తం గుడ్డును తీసుకోవడం మంచిది. ఎందుకంటే పచ్చసొనలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.

క్యాబేజీ, బ్రోకలీ

బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, చైనీస్ క్యాబేజీ వంటి మొదలైన కూరగాయలు థైరాయిడ్ సమతుల్యతకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

పండ్లు

థైరాయిడ్‌ను సమతుల్యంగా ఉంచడానికి అయోడిన్‌తో పాటు సెలీనియం, విటమిన్ డి కూడా అవసరం. దీనితో పాటు పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు కూడా చాలా ముఖ్యమైనవి.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.