పొగతాగడం ఆరోగ్యానికి హానికారమనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. అయినా పొగరాయుళ్లు మాత్రం ఈ అలవాటును అంత సులభంగా వదిలించుకోలేరు. అయితే దీర్ఘకాలంగా స్మోకింగ్ చేసే అలవాటు ఉన్న వారు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
స్మోకింగ్ చేయడం వల్ల నోటి, స్వరపేటిక, ఫారింక్స్ అన్నవాహిక, మూత్రపిండాలు, ధూమపానం, కాలేయం, గర్భాశయం, ప్యాంక్రియస్, కడుపు, మూత్రాశయం వంటి ఎన్నో క్యాన్సర్లకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే దీర్ఘకాలంగా స్మోకింగ్ చేసే అలవాటు ఉన్న వారు కచ్చితంగా కొన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతటీ ఆ పరీక్షలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
దీర్ఘకాలంగా స్మోకింగ్ చేసే అలవాటు ఉన్న వారు గుండె ఎక్స్‌రే చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని తెలుపుతుంది. క్రానిక్ అబ్ర్స్టక్టివ్ పల్మనరీ డిసీజ్, ఎంఫిసెమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలను గుర్తించడంలో ఈ పరీక్ష దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఊపిరితిత్తుల పనితీరును తెలియజేసే స్పిరోమెట్రీ పరీక్షను కూడా చేయించుకోవాలి.
ఈ పరీక్ష.. ధూమపానం అలవాటు ఉన్నవారిలో ఎక్కువగా కనిపించే ఉబ్బసం, COPD వంటి పరిస్థితులు ఊపిరితిత్తుల వ్యాధుల పురోగతిని ట్రాక్ చేసేందుకు సహకరిస్తుంది. ఇక లంగ్స్ సిటీ స్కాన్ ద్వారా కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఈ స్కాన్ ద్వారా లంగ్ క్యాన్సర్‌తో పాటు ఇతర సమస్యలను గుర్తిస్తుంది. కంప్లీట్ బ్లడ్ కౌంట్ ద్వారా కూడా ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. స్మోకింగ్ ద్వారా సోకే రక్తహీనత, రక్తంలో ఇన్ఫెక్షన్లు వంటి పరిస్థితుల్ని గుర్తిస్తుంది. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా ధూమపానం చేసే వారిలో పెరిగిన గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేసేందుకు కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుపుతుంది. స్మోకింగ్ చేసే వారి రక్తంలో ఉండే కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలను కార్బాక్సీహెమోగ్లోబిన్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.
శరీరంపై ఇన్ని రకాల ప్రభావం చూపుతుంది కాబట్టే వైద్యులు స్మోకింగ్ అలవాటును మానుకోవాలని సూచిస్తుంటారు. ధూమపానం అలవాటును క్రమంగా మానుకోవాలి. ఇందుకోసం నికోటిన్ గమ్, లాజెంజెస్, నాసల్ స్ప్రేలు, నికోటిన్ రీప్లేస్ మెంట్ థెరపీలు ఉపయోగపడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..