
వాము గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పూర్వం నుంచి వామును మన వంటల్లో ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఇప్పుడంటే వాడకం బాగా తగ్గిపోయింది కానీ.. పూర్వం ఎక్కువగా తీసుకునేవారు. అందుకే అప్పటి పెద్దవాళ్లు ఎలాంటి జబ్బులు, అనారోగ్య సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడేవారు. వాములో ఎన్నో ఆయుర్వేద గుణాలు దాగి ఉన్నాయి. మనం నిత్యం ఉపయోగించే వాటితోనే.. ఎన్నో సమస్యల్ని తగ్గించుకోవచ్చు. అలాగే వాముతో కూడా చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా జీర్ణ సమస్యల్ని మాయం చేస్తుంది వాము. అదే విధంగా ఉదయం ఖాళీ కడుపుతో వాము నీటిని తాగితే.. శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. పరగడుపున వాము వాటర్ తీసుకోవడం వల్ల బాడీలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. మెటబాటిజం సరిగ్గా ఉండాలి. మెటబాలిజం తక్కువగా ఉంటే.. రోగ నిరోధక శక్తి తగ్గి.. ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో వాము వాటర్ తాగితే.. శరీరంలో అమాంతం మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇవి క్యాలరీలను కరిగించి.. సులభంగా వెయిట్ లాస్ అయ్యేలా చేస్తుంది. వెయిల్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఇలా ట్రై చేయండి.
శరీరం డిటాక్సిఫికేషన్ అవ్వడం చాలా ముఖ్యం. వాము నీటిని తీసుకున్నా, వాము తిన్నా.. కడుపులోని మలినాలను, విష పదార్థాలను మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపిచేస్తుంది వాము. పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. దీంతో కాలేయం, మూత్ర పిండాల ఆరోగ్యం కూడా పెరుగుతుంది.
ప్రస్తుతం కాలంలో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు మంచి డైట్, వ్యాయామంతో పాటు వాము నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలను తక్కువ సమయంలోనే అందుకుంటారు. వాము నీరు శరీరంలోని కేలరీలను తగ్గించి.. వెయిట్ తగ్గేలా చేస్తుంది.
ఉదయం ఖాళీ కడుపుతో వాము నీటిని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపులోని, ప్రేగులను శుభ్ర పరిచి.. విష పదార్థాలను బయటకు పంపుతుంది. వాము నీరు తాగడం వల్ల మలబద్ధకం, అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..