ఉప్పు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఉప్పును మన ఆహారంలోకి చేర్చడానికి కారణం ఇదే. ఉప్పులో ఎక్కువా అయోడిన్ ఉంటుంది. ఈ అయోడిన్ శరీరానికి కూడా చాలా అవసరం. అయోడిన్ సరిగా అందితే మెదడు, థైరాయిడ్ గ్రంథి ఎంతో యాక్టివ్‌గా పని చేస్తాయి. శరీరం హైడ్రేట్‌గా, శక్తివంతంగా ఉండాలన్నా అయోడిన్ కావాలి. నీరసంగా, అసలటగా ఉన్నా అందుకు అయోడిన్ లేకపోవడే. అంతే కాకుండా ఉప్పులో ఇతర లవణాలు, పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఉప్పును సరైన మోతాదులో తీసుకుంటే మంచిదే. కానీ మరీ ఎక్కువగా తింటే మాత్రం రక్త పోటుపై ఎఫెక్ట్ పడటం ఖాయం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉప్పును.. ప్రతి రోజూ నీటిలో కలిపి ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున ఉప్పు కలిపిన ఓ గ్లాస్ నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రక్త పోటు సమస్య ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా తీసుకోవాలి.
బయట వేడి వాతావరణంలో, ఎండలో పని చేసేవారు ఉప్పు నీటిని తాగడం చాలా మంచిది. ఎందుకంటే వీరి బాడీలో ఉన్న నీటి శాతం, చెమ రూపంలో ఎక్కువగా బయటకు పోతుంది. బాడీలో ఎలక్ట్రోలైట్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి ఉప్పు నీరు తాగడం వల్ల మళ్లీ శక్తి వస్తుంది. బాడీ కూడా బ్యాలెన్స్ అవుతుంది.
కండరాలు సరిగా పనిచేయడానికి కూడా ఉప్పు కావాలి. ఉప్పులో సోడియం, పొటాషియం, క్లోరైడ్‌లు లభిస్తాయి. వీటితో పాటు నీరు అందడం వల్ల కండరాలు, నాడీ కణాలు పని తీరు మెరుగు పడుతుంది.
ఉప్పు నీరు తాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. ఎగ్జీమా, సోరియాసిస్ వంటి సమస్యలతో బాధ పడేవారు ఉప్పు నీరు తాగితే చాలా మంచిది. వీటి నుంచి త్వరగా బయట పడొచ్చు. ఇన్ ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది, దురద, దద్దర్లను కంట్రోల్ చేస్తుంది.
ఉదయాన్నే ఉప్పు కలిపిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గ్యాస్, మల బద్ధకం, అజీర్తి సమస్య తగ్గుతుంది. కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. శరీరం పోషకాలు గ్రహించేందుకు ఉపయోగ పడుతుంది. పేగుల్లో ఉండే మలినాలు, వ్యర్థాలు కూడా బయటకు పోతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.