White hair: చిన్న వయసులో తెల్ల వెంట్రుకలకు అసలు కారణం ఏంటో తెలుసా.?

జుట్టు నెరసిపోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఒకప్పుడు ఎక్కువగా వయసు మళ్లిన వారిలోనే ఈ సమస్య కనిపించేది. కానీ ప్రస్తుతం తక్కువ వయసు ఉన్న వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. చిన్న పిల్లల్లోనూ తెల్ల జుట్టు సమస్య ఎక్కువుతోంది. ఇంతకీ చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్యకు అసలు కారణం ఏంటి.?

White hair: చిన్న వయసులో తెల్ల వెంట్రుకలకు అసలు కారణం ఏంటో తెలుసా.?
Remedies for White Hair

Updated on: Jun 02, 2024 | 7:48 PM

జుట్టు నెరసిపోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఒకప్పుడు ఎక్కువగా వయసు మళ్లిన వారిలోనే ఈ సమస్య కనిపించేది. కానీ ప్రస్తుతం తక్కువ వయసు ఉన్న వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. చిన్న పిల్లల్లోనూ తెల్ల జుట్టు సమస్య ఎక్కువుతోంది. ఇంతకీ చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్యకు అసలు కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలి ఇప్పుడు తెలుసుకుందాం..

* కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా తెల్ల వెంట్రుకలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి శరీరంలో ఉండే మైటోకాండ్రియాలో మార్పులకు కారణమవుతుంది. ఇది జుట్టు ప్రోటీన్‌ను తగ్గిస్తుంది. వెంట్రుకలు తెల్లబడడానికి ఇది ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

* శరీరంలో పోషక లోపం కారణంగా కూడా జుట్టు తెల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్న తనంలో పోషకాహార లోపంతో బాధపడేవారిలో తెల్ల జుట్టు సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

* ఎక్కువసేపు ఎండకు గురికావడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే మెలనిన్ తగ్గుతుంది, ఇది కూడా తెల్ల జుట్టుకు ఒక కారణమని నిపుణులు అంటున్నారు. తీవ్రమైన సూర్యరశ్మికి గురికావడం వల్ల, జుట్టులో ఉండే ప్రొటీన్లు కూడా విరిగిపోతాయి. దీనివల్ల జుట్టు నిర్జీవంగా మారుతుంది.

ఇవి పాటించండి..

* తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండాలంటే విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఉసిరిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఉసిరి రసాన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల మేలు జరుగుతుంది.

* ఉల్లిపాయ రసంలో సల్ఫర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి తెల్ల జుట్టు సమస్యను దూరం చేస్తుంది. వారానికి రెండుసార్లు ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టిస్తే తెల్ల జుట్టు సమస్య రాదు.

* కరివేపాకులో విటమిన్ బి, సి, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు మేలు చేస్తాయి. కరివేపాకు పేస్ట్‌ను పెరుగుతో కలిపి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు తెల్లబడడం తగ్గుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Hair,Hair Tips,White Hair,Gray Hair, Lifestyle, White hair, White hair tips

This is the main reason for white hair in young age