
చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. కాంతివంతంగా, అందంగా కనిపించాలంటే.. మంచి హెల్దీ డైట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అప్పుడే యంగ్ లుకింగ్‌తో ఆకట్టుకుంటారు. ముఖ్యంగా వర్కౌట్స్ చేయడం, నీరు తాగడం, మంచి హెల్దీ డైట్ ఫాల్ అవ్వాలి. స్కిన్ అందంగా మెరుస్తూ ఉండాలంటే.. యోగాసనాలు కూడా హెల్ప్ చేస్తాయి. యోగాసనాలతో ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వీటిని చేయడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అలాగే శరీరమంతా రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. అదే విధంగా ఆరోగ్యంగా మారుతుంది. యోగసనాలతో చర్మం సాఫ్ట్‌గా తయారవుతుంది. మరి ఆ ఆసనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సర్వాంగాసన వేయడం వల్ల భుజాలు, వెనుక భాగం బలంగా మారుతుంది. అలాగే అందంగా తయారవుతుంది. వెన్నుముక సమస్యలు, కాళ్ల సమస్యలు ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రక్తం కూడా శుద్ధి అవుతుంది. అంతే కాకుండా శరీరంలోని అన్ని భాగాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
ఈ హాలాసనం వేయడం వల్ల బాడీకి రిలాక్సేషన్ దొరకుతుంది. భుజాలు, వెన్నుముక వంటికి రిలాక్స్ అవుతాయి. వాటికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గి.. మనస్సుకు హాయిగా ఉంటుంది. జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. అదే విధంగా శరీరం అంతా రక్త ప్రసరణ జరుగుతంది. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
త్రికోణాసనంతో కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఆసనం వేయడం వల్ల ఛాతీ, భుజాలు, కాళ్లు రిలాక్స్ అవుతాయి. వీటికి సంబంధించిన నొప్పులు కూడా అదుపులోకి వస్తాయి. అలాగే ఆక్సిజన్ బాగా అందుతుంది. చేతులు, కాళ్లు, తొడలు బలంగా మారతాయి. చర్మం సాగి.. ఆరోగ్యంగా తయారవుతుంది. దీంతో మీ చర్మం మెరిపిపోతుంది.
ఈ ఆసనాలతో పాటు మీరు మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి, టెన్షన్ వంటివి దూరం అవుతాయి. మనసు, శరీరం రిలాక్స్ అవుతుంది. దీంతో మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. దీంతో లోపల నుంచి మీకు తెలియకుండా ఆనందంగా ఉంటుంది. ఇలా కూడా చర్మానికి గ్లో వస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.