Lifestyle: ఈ చర్మ సమస్యలను లైట్ తీసుకోకండి.. డయాబెటిస్‌ కావొచ్చు..

|

May 16, 2024 | 12:17 PM

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్‌ ఒకటి. ఈ వ్యాధి బారిన ఒక్కసారిగా పడితే అంత సులభంగా బయటపడలేము. అందుకే షుగర్‌ను త్వరగా గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అయితే శరీరంలో షుగర్‌ ప్రారంభమైందన్న విషయాన్ని...

Lifestyle: ఈ చర్మ సమస్యలను లైట్ తీసుకోకండి.. డయాబెటిస్‌ కావొచ్చు..
Diabetes
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్‌ ఒకటి. ఈ వ్యాధి బారిన ఒక్కసారిగా పడితే అంత సులభంగా బయటపడలేము. అందుకే షుగర్‌ను త్వరగా గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అయితే శరీరంలో షుగర్‌ ప్రారంభమైందన్న విషయాన్ని కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. వీటిలో డెర్మోపతి ఒకటి. ఇది డయాబెటిస్‌ కారణంగా వచ్చే ఒక రకమైన చర్మ వ్యాధి. డయాబెటిస్‌ ముందుస్తు లక్షణాల్లో ఒకటైన డెర్మోపతిని ఎలా గుర్తించాలి.? ఈ వ్యాధి వల్ల కినిపించే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* శరీరంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు. పాదాల పైభాగాల చర్మంపై చిన్న నలుపు, గోధుమ రంగు గాయాలు ఏర్పడతాయి. అలాంటి సమస్య ఉంటే, వెంటనే అప్రమత్తమవ్వాలి. డెర్మోపతి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది.

* ఎలాంటి కారణం లేకుండా చర్మంపై చిన్న మొటిమలు కనిపిస్తే, ఇవి రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి లక్షణంగా చెప్పొచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

* శరీరంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు, చర్మంపై గాయాలు, పుండ్లు కనిపిస్తాయి. దీర్ఘకాలంగా ఈ సమస్య వేధిస్తుంటే వైద్యుల సూచనలు పాటించాలని నిపునులు చెబుతున్నారు.

* చర్మంపై ఊదా, ఎరుపు, గోధుమ లేదా పసుపు రంగు గుర్తులు కనిపిస్తే విస్మరించకూడదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని చెప్పడానికి సంకేతాం కావొచ్చు.

* పదే పదే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ అవుతుంటే కూడా రక్తంలో చక్కెర స్థాయి పెరిగాయని అర్థం చేసుకోవాలి. ఈ కారణంగా చర్మంపై దురద వేధిస్తుంటుంది. దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..