
ప్రస్తుతం ఊబకాయం బారినపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా బరువు పెరుగుతున్నారు. దీంతో బరువు తగ్గేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే బరువు తగ్గడం అనగానే చాలా మంది వ్యాయామం చేయడం లేదా కడుపు మాడ్చుకోవడమే అనుకుంటారు. అయితే జీవనశైలిలో చేసుకునే కొన్ని మార్పుల ద్వారా బరువు ఇట్టే తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని నేచురల్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* చియా విత్తనాలు బరువు తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో కరిగే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును కంట్రోల్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. చియా గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల త్వరగా కుడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో త్వరగా బరువు తగ్గడంలో దోహదపడుతుంది. మరీ ముఖ్యంగా ఉదయం పడగడుపున ఖాళీ కడుపుతో తీసుకుంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.
* అవిసె గింజలు కూడా బరువు కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవిసె గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి. ఒక గ్లాసులో అవిసె గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే మరగించి తాగాలి. ఇలా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
* వాల్‌నట్స్‌లో కూడా బరువును కంట్రోల్ చేయడంలో ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా రాత్రంతా వాల్‌నట్స్‌ను నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు కంట్రోల్ అవుతుంది.
* పొద్దు తిరుగుడు విత్తనాలు కూడా బరువును తగ్గించడంలో ఉపయోగపడుతాయి. ఇందులో కేలరీలు పుష్పలంగా ఉంటాయి. ప్రోటీన్, కొవ్వు, ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. నానబెట్టిన పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు.
* బాదం ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడతాయి. రక్తపోటును తగ్గిస్తుంది. ఇది ఆకలిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..