Weight Loss Exercises : బరువు తగ్గడానికి, బెల్లీఫ్యాట్‌ కరగడానికి ఈ నాలుగు ఎక్సర్‌సైజ్‌లు సూపర్..! ట్రై చేసి చూడండి..

|

May 22, 2021 | 5:50 PM

Weight Loss Exercises : అధిక తీవ్రత గల వర్కవుట్స్ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు కండరాలు కూడా బలోపేతం అవుతాయి.

Weight Loss  Exercises : బరువు తగ్గడానికి, బెల్లీఫ్యాట్‌ కరగడానికి ఈ నాలుగు ఎక్సర్‌సైజ్‌లు సూపర్..! ట్రై చేసి చూడండి..
Weight Loss Exercises
Follow us on

Weight Loss Exercises : అధిక తీవ్రత గల వర్కవుట్స్ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు కండరాలు కూడా బలోపేతం అవుతాయి. నిత్య యవ్వనంగా ఉంటారు. లాక్‌డౌన్ వల్ల చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో శారీరక శ్రమ లేకపోవడం వల్ల స్థూలకాయం పెరిగి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇటువంటి వారికి ఈ వ్యాయామాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి, జీవక్రియను ప్రోత్సహించడానికి, శరీరాన్ని బలంగా చేయడానికి సహాయపడతాయి. బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. కడుపు చుట్టూ ఉండే కొవ్వు వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఇతర వ్యాధులకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఉదర కొవ్వును తగ్గించడానికి రోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఈ రోజు మనం నాలుగు వ్యాయామాల గురించి తెలుసుకుందాం. తద్వారా మీరు బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా కరిగించవచ్చు.

1. బర్పీ వ్యాయామం
బర్నింగ్ వ్యాయామం చేయడం వల్ల 50 శాతం కేలరీలు కరిగిపోతాయి. ఇది మీ శరీరాన్ని బలంగా చేస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరిచే పూర్తి శారీరక వ్యాయామం. ఈ వ్యాయామం చేయడానికి మీకు పరికరాలు అవసరం లేదు. మీ పాదాలను దగ్గరగా ఉంచండి. చేతులను కొంచెం వెడల్పుగా పెట్టండి. స్క్వాట్స్ పొజిషన్‌లోకి వెళ్లి మీ చేతులను నేలపై ఉంచండి. ఇప్పుడు మీ పాదాలను ముందుకు తీసుకురండి ఆపై తిరిగి స్క్వాట్ స్థానానికి రండి. ఇలా పునరావృతం చేయండి.

2. జంప్ స్క్వాట్స్
ఈ వ్యాయామం మీ ఎగువ మరియు దిగువ శరీర కండరాలను బలపరుస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది చేయుటకు మీరు స్క్వాట్ పొజిషన్ పైకి దూకి యధావిధిగా అదే స్థానానికి రావాలి. జంప్ స్క్వాట్స్ చేస్తున్నప్పుడు ఎగరడం మీద కాకుండా జంప్స్ మీ పాదాలను తాకే విధంగా చూసుకోండి.

3. స్కిప్పింగ్
రోప్ జంపింగ్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన వ్యాయామం. ఈ వ్యాయామానికి కావలిసిందల్లా ఒక తాడు మాత్రమే. ఈ వ్యాయామం కొవ్వును కరిగించడంతో పాటు పాదాల కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీని కోసం నిటారుగా నిలబడి తాడు పట్టుకోండి. మీ కాళ్ళ మధ్య ఎక్కువ అంతరం ఉండకూడదు. ఇప్పుడు తాడు నుంచి దూకడం ప్రారంభించండి.

4. ప్లాంక్
ప్లాంక్ గొప్ప వ్యాయామం. ఇది శరీర కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, ఇది మీ శరీరానికి చక్కటి ఆకృతిని ఇస్తుంది. ఇందుకోసం ముందుగా పడుకొని అరచేతులను చాప మీద ఉంచి, మీ శరీరాన్ని పైకి లేపండి. చేతులను నిటారుగా ఉంచండి. సాధ్యమైనంత ఎక్కువ కాలం ఈ స్థితిలో ఉండటానికి ప్రయత్నించండి.

Mega oxygen Tankers: దేశంలో ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు ‘మేఘా’ సంస్థ మహా యజ్ఞం.. థాయిలాండ్‌ నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లు

Corona Free village: దుగ్గిరాలపాడు.. కృష్ణా జిల్లాలోని ఈ గ్రామానికి క‌రోనా అంటలేదు.. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు సెల్యూట్

YS Jagan Letter to PM Modi: ప్రైవేట్‌ ఆస్పత్రులకు నేరుగా కరోనా టీకాలు ఇవ్వద్దు.. వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ