బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) వస్తే ఎలాంటి మనిషైనా కుప్పకూలిపోవాల్సిందే. స్ట్రోక్ బారిన పడితే శరీరంలో సగభాగం చచ్చుబడి పోతుంది. మాట్లాడలేరు, నడవలేరు, తినలేరు.. ఏదీతామంతట తాము చేయలేరు. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే తొలి గంటలో స్పందిస్తే శరీరంలోని అవయవాలను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. స్ట్రోక్ వచ్చినప్పుడు శరీర సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ ఆకృతి క్షీణత, చేతులు మెలితిప్పడం, పాదాలలో వక్రత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడులో సిరలు పగిలిపోవడం వల్ల స్ట్రోక్ సమస్య తెలెత్తుతుంది. సిరల్లో ఫలకం పేరుకుపోయిన, అధిక రక్త పోటు ఉన్నవారికి కూడా ఇలాంటి సమస్యలే వస్తాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత హెమరేజిక్ స్ట్రోక్ కు గురవుతున్నారు. దీని కారణంగా కొంత మంది ప్రాణాపాయ స్థితిలో పడుతున్నారు.
నిత్యం తీసుకునే పలు రకాల ఆహారాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణుల అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బ్రెడ్‌తో తయారు చేసే ఆహారాలకు దూరంగా ఉండాలంటున్నారు. బ్రెడ్‌లో సోడియం లేబుల్ అధిక పరిమాణంలో లభిస్తుంది. వీటిని అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారు తినడం వల్ల వారికి ప్రాణాంతకంగానూ మారే అవకాశాలున్నాయి. శాండ్‌విచ్‌లు తినే అలవాటున్నవారు అతిగా తినడం మానుకోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సోడియం కలిగిన ఆహారాలు అతిగా తీసుకున్న ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి వారు గుడ్లు, ఆమ్లేట్ ప్రతి రోజూ తినడం వల్ల మెదడు సిరలు పగిలిపోయే ప్రమాదం ఎక్కువట. హై బీపీ ఉన్నవారు వేపుళ్లు తినడం మానుకోవాలి. అధిక రక్తపోటు ఉన్నవారు ఈ విధమైన ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చని నిపుణులు అంటున్నారు.