మనిషికి తిండి ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి, జీవన విధానం మారింది ఈ కారణంగా నిద్రలేమీ సమస్యతో బాధపడుతున్న వారిక సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడం, ఫిష్ట్‌ల్లో పనిచేయడం కూడా నిద్రలేమీకి కారణమవుతుందని నిపుణుల అంటున్నారు.
అయితే నిద్రలేమి సమస్య కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయ నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్య వేధిస్తుంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు అంటున్నారు. నిద్రలేమి సమయం పెరిగినా కొద్దీ శరీరంలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. శరీరంలో కొన్ని లక్షణాలు నిద్రలేమీ లక్షణాలుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
24 గంటలు మించి నిద్రలేమితో బాధపడుతుంటే.. మెదడు పనితీరు మందగించిన భావన కలుగుతుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది, ప్రతీ చిన్న విషయానికి చిరాకు పడుతుంటారు. నిద్రలేమీ కారణంగా నాడీవ్యవస్థలో సమతుల్యం దెబ్బతింటుంది. కండరాల నొప్పి మొదలవుతుంది. ఒకవేళ మూడు రోజులపాటు నిద్రలేకపోతే.. మెదడు తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని నిపుణులు చెబుతున్నారు.
నిత్యం దిగాలుగా ఉండడం, మతి స్థిమితంగా లేకపోవడం, చర్మంపాలిపోవడం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కంటి చూపుక్రమంగా మందగిస్తుంది. ఇక ఒకవేళ వారం రోజులకు మించి నిద్రలేమితో బాధపడుతుంటే మాత్రం మనిషి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. నెలరోజులు నిద్రకు దూరమైతే పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు చెబుతున్నారు. క్రమంగా మనిషి ఆలోచించే శక్తిని కూడా కోల్పోతుంటారు. చమటలు పట్టడం, త్వరగా బరువు తగ్గడం, హార్మోన్లలో వ్యత్యాసం వంటి సమస్యలకు దారి తీస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..