Health: శరీరంలో విటమిన్‌ డీ ఎక్కువైనా నష్టమే.. ఈ లక్షణాలతో తెలుసుకోవచ్చు..

|

Jul 31, 2024 | 11:11 AM

శరీరానికి విటమిన్‌ డీ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరానికి సరిపడ విటమిన్‌ డీ లభించకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే ప్రస్తుతం అపార్ట్‌మెంట్ కల్చర్‌ పెరగడం, ఆఫీసుల్లో ఏసీ గదుల్లో గంటలతరబడి పని చేస్తుండడం వల్ల విటమిన్‌ డీ లోపం బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో చాలా మంది విటమిన్‌ డీ సప్లిమెంటరీలను..

Health: శరీరంలో విటమిన్‌ డీ ఎక్కువైనా నష్టమే.. ఈ లక్షణాలతో తెలుసుకోవచ్చు..
Vitamin D Excess
Follow us on

శరీరానికి విటమిన్‌ డీ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరానికి సరిపడ విటమిన్‌ డీ లభించకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే ప్రస్తుతం అపార్ట్‌మెంట్ కల్చర్‌ పెరగడం, ఆఫీసుల్లో ఏసీ గదుల్లో గంటలతరబడి పని చేస్తుండడం వల్ల విటమిన్‌ డీ లోపం బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో చాలా మంది విటమిన్‌ డీ సప్లిమెంటరీలను తీసుకుంటున్నారు. దీంతో శరీరంలో విటమిన్‌ డీ ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఇంతకీ విటమిన్ డీ ఎక్కువైతే ఎలాంటి నష్టాలు ఉంటాయి.? ఇంతకీ విటమిన్‌ డీ ఎక్కువైతే కనిపించే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా శరీరంలో మిల్లీలీటర్‌కు 20 నుంచి 40 నానోగ్రాములు (ng/mL)గా ఉండాలి. విటమిన్‌ డీ ఈ స్థాయిలో ఉంటే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. ఈ స్థాయి తగ్గితే శరీరంలో బలహీనత, ఎముకల నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే కొందరిలో విటమిన్‌ డీ తక్కువైతే చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ఉదయం కచ్చితంగా కాసేపైనా సూర్య రక్ష్మి తగిలేలా చూసుకోవాలి.

ఇదిలా ఉంటే విటమిన్‌ డీ ఎక్కువైతే కొన్ని రకాల సమస్యలు తలెత్తుతుఆయి. ముఖ్యంగా విటమిన్‌ డి ఎక్కువైతే.. ఎముకల్లో నొప్పి, బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. నడవడంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న చిన్న పనులకే త్వరగా అలసిపోతుంటారు. విటమిన్‌ డీ ఎక్కువైతే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇది మూత్రపిండాల పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, ఇతర కిడ్నీ సంబంధిత సమస్యలకు కూడా దారితీయవచ్చు.

అలాగే విటమిన్‌ డీ ఎక్కువైతే ఆకలి తగ్గుతుంది. ఉన్నపలంగా బరువు తగ్గుతున్నా విటమిన్‌ డీ ఎక్కువైనట్లు అర్థం చేసుకోవాలి. విటమిన్‌ డీ ఎక్కువైతే కడుపు సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. ఇక విటమిన్‌ డి అధికంగా ఉండడం వల్ల గుండె కొట్టుకోవడం క్రమరహితంగా ఉంటుంది. అలాగే.. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

విటమిన్‌ డి ఎక్కువైతే..

శరీరంలో విటమిన్‌ డి ఎక్కువైతే విటమిన్‌ డీ సప్లిమంట్లను తీసుకోకూడదు. వైద్యుల సూచనలు లేకుండా విటమిన్‌ డీ సప్లిమెంటరీ ట్యాబ్లెట్స్‌ తీసుకోకూడదు. అలాగే విటమిన్‌ డీ ఎక్కువగా లభించే చేపలు (సాల్మన్, ట్యూనా), గుడ్డు, తృణధాన్యాలకు దూరంగా ఉండాలి. విటమిన్ డీ ఎక్కువగా ఉంటే సూర్య రక్ష్మిలో గడిపే సమయాన్ని తగ్గించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..