
Life Style: పడుకునేప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో విధానాన్ని పాటిస్తుంటారు. ఎవరి కంఫర్ట్‌కు తగ్గట్లు వారు నిద్రపోయే విధానాన్ని అవలంభిస్తుంటారు. అయితే తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పులు పెను ప్రమాదాన్ని కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం కుర్చునే విధానం తప్పుగా ఉంటే ఎలాగైనే సమస్యలు వస్తాయో అలాగే పడుకునే విధానం సరిగా లేకపోయినా సమస్యలు తప్పవని చెబుతున్నారు. మనలో చాలా మంది బోర్లా పడుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా పడుకోవడం వల్ల చాలా రిలాక్స్ అయిన భావన కలుగుతుంది. అయితే ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
బోర్లా పడుకోవడం వల్ల మెడ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణంగా బోర్లా పడుకున్నప్పుడు మెడ ఏటో ఒకవైపు తిప్పి పడుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో దిండు కారణంగా మెడకు, వీపుకు మధ్య గ్యాప్ ఏర్పడతుంది. దీనివల్ల మెడ నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది భుజం నొప్పికి కూడా దారి తీస్తుందని చెబుతున్నారు.
అలాగే బోర్లా పడుకోవడం వల్ల పొట్ట, ఊపిరితిత్తులపై శరీరం బరువుమొత్తం పడుతుంది. ఈ కారణంగా శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక బోర్లా పడుకోవడం వల్ల కలిగే మరో నష్టం మొహంపై ముడతలు పడడం. రాత్రంతా దిండుకు మొహాన్ని అనిచ్చి పడుకోవడం వల్ల మొహంపై ముడతలు పడే అవకశాలు ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లో బోర్లా పడుకోకూడదని. దీనివల్ల కడుపులోని బిడ్డపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..