Lifestyle: జీవితాన్ని మార్చుకోవాలనుకుందా.? వెంటనే ఈ అలవాట్లను మార్చుకోండి..

|

Sep 18, 2023 | 8:41 AM

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు బిజీ లైఫ్‌స్టైల్‌తో మనిషి ఆరోగ్యాన్ని పట్టించుకునే సమయం కూడా ఉండడం లేదు. దీంతో ఆరోగ్యంపై ఆసక్తి పెట్టే వారి సంఖ్య కూడా పెద్దగా ఉండడం లేదు. జీవితం నిత్యం ఆరోగ్యం, ఆనందంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అలవాట్లను పాటించడం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటంటే..

Lifestyle: జీవితాన్ని మార్చుకోవాలనుకుందా.? వెంటనే ఈ అలవాట్లను మార్చుకోండి..
Lifestyle
Follow us on

మనిషి జీవితం ఉరకుల, పరుగుల మయంగా మారింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు బిజీ లైఫ్‌స్టైల్‌తో మనిషి ఆరోగ్యాన్ని పట్టించుకునే సమయం కూడా ఉండడం లేదు. దీంతో ఆరోగ్యంపై ఆసక్తి పెట్టే వారి సంఖ్య కూడా పెద్దగా ఉండడం లేదు. జీవితం నిత్యం ఆరోగ్యం, ఆనందంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అలవాట్లను పాటించడం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటంటే..

* జీవితం మారాలంటే మొదటిగా పాటించాల్సి నియమం ఉదయం త్వరగా లేవడం. ప్రతీరోజూ ఉదయం 6 గంటలలోపు నిద్రలేవడాన్ని ఒక తప్పనిసరి అలవాటుగా మార్చుకోవాలి. ఉదయం నిద్రలేస్తే రోజంతా తాజాగా ఉంటారు. రోజులో చేసే పనిలో కూడా నాణ్యత పెరుగుతుంది. రాత్రుళ్లు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి నిద్రలేవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో స్పష్టమైన మార్పును గమనించవచ్చు.

* జీవితం ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలంటే మనిషి నిత్య విద్యార్థిలాగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి, లేదా ఒక నైపుణ్యం వంటివి నేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో బోరింగ్‌ అనే పదాన్ని స్థానమే ఉండదు. అలాగే కెరీర్‌ గ్రోత్‌కు కూడా ఇది ఎంతగానో ఉపయోపడుతుంది.

* ఉరుకుల పరుగుల లైఫ్‌ స్టైల్‌తో జీవితం యాంత్రికంగా మారిపోయింది. కాబట్టి మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి. ప్రకృతిలో కాసేపు తిరగడం అలవాటు చేసుకోవాలి. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మానసిక ఆందోళన తగ్గి, ఒత్తిడి దూరమవుతుంది.

* జీవితాన్ని మార్చే మరో మంచి అలవాటు ప్రతిరోజూ డైరీ రాయడం. డైరీ రాయడం వల్ల మీరు చేస్తున్న తప్పులు, ఒప్పులు ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు. చేసిన తప్పులను మరోసారి చేయకుండా ఉండొచ్చు. అలాగే తప్పు ఎక్కడ జరుగుతుందన్న దానిపై కూడా స్పష్టత వస్తుంది.

* శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. మానసిక ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వ్యాయామానికి సమయం కేటాయించినట్లే మానసిక ఆరోగ్యానికి కూడా సమయం కేటాయించాలి.

* జీవితాన్ని మార్చే మరో మంచి అలవాటు పుస్తకం చదవడం. పుస్తకాలు చదివే అలవాటు జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మంచి పుస్తకాలు చదడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు జ్ఞానాన్ని పెంచుతుంది. పుస్తకాలు చదవడం వల్ల జీవితాన్ని చూసే కోణం కూడా మారుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..