Custard apple: సీతాఫలం గింజలను పడేస్తున్నారా.? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

|

Oct 18, 2024 | 10:57 AM

ప్రతీ ఒక్కరూ సీతాఫలాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. రుచిలో అమోఘంగా ఉండే సీతాఫలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. అయితే సీతాఫలం గింజలను పడేస్తుంటాం. కానీ వీటి వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సీతాఫలం గింజలను ఎండబెట్టి పొడిగా మార్చి తీసుకుంటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Custard apple: సీతాఫలం గింజలను పడేస్తున్నారా.? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Custard Apple Seeds
Follow us on

చలికాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా సీతాఫలాలు కనిపిస్తుంటాయి. రుచిలో అమృతాన్ని తలపించే సీతాఫలాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీజన్‌లో లభించే పండ్లను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే కేవలం సీతాఫలం మాత్రమే కాకుండా.. సీతాఫలం గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

సాధారణంగా సీతాఫలం గింజలను పడేస్తుంటాం. కానీ ఈ గింజల్లో విటమిన్ ఏ, విటమిన్ కె, విటమిన్ సి, బి వన్, విటమిన్ ఈ వంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజల్లో జింక్ ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. సీతాఫలం గింజలను సేకరించి వాటిని ఎండబెట్టాలి. ఆ తర్వాత ఆ గింజలను గ్రైండ్‌ చేసి పొడిగా చేసుకొని ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఇలా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగువుతుంది. ఇందులోని ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ గింజల్లో డైటరీ ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది, దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది. సీతాఫలం గింజలు వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. గింజల్లో ఉండే విటమిన్ సి చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు ఈ గింజల పొడిని తీసుకోవాలి. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సీతాఫలం గింజలు ఉపయోగపడతాయి. సీతాఫలం గింజల్లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. సీతాఫలం గింజల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కదుళ్లను బలోపేతం చేస్తుంది. ఇందులోని విటమిన్‌ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..