Summer Diet: వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా? ఇవి మాత్రం తినకండి..
ఎండాకాలంలో మనం తీసుకొనే ఆహారం కూడా ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు వంటివి తగినంత నీరు, పోషకాలతో నిండి ఉంటాయి. వేడి వాతావరణాన్ని అధిగమించడానికి ఇవి మీకు సాయపడతాయి.

భానుడు విజృంభిస్తున్నాడు. ప్రచండ ఎండను కుమ్మరిస్తున్నాడు. విపరీతమైన వేడిని భూమిపైకి దించుతున్నాడు. ఫలితంగా జనాలు ఆపసోపాలు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వేడిగాలులు మరింత విస్తృతమవుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)ఇప్పటికే రాష్ట్రానలు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. బయటకు వెళ్లే టప్పుడు ఎండతగలుకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే శరీరానికి చలువ చేసే ఆహారం తీసుకోవాలి. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఎండాకాలంలో మనం తీసుకొనే ఆహారం కూడా ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు వంటివి తగినంత నీరు, పోషకాలతో నిండి ఉంటాయి. వేడి వాతావరణాన్ని అధిగమించడానికి ఇవి మీకు సాయపడతాయి. పుచ్చకాయ, సీతాఫలం, కీరదోస, స్ట్రాబెర్రీలు, పాలకూర, బచ్చలికూర వంటివి తీసుకోవడానికి ప్రయత్నించండి. వీటితో పాటు, కొబ్బరి నీరు, ఐస్‌డ్ టీ, నిమ్మరసం వంటి హైడ్రేటింగ్ పానీయాలు. అలాగే కొన్ని పదార్థాలు వేడి వాతావరణంలో తినకూడనివి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎండ వాతావరణంలో తినవలసినవి.. తినకూడని ఆహార పదార్థాల గురిం ఇప్పుడు తెలుసుకుందాం..
ఇవి తప్పనిసరిగా తీసుకోవాలి..
రైతా: ఇది పెరుగు, దోసకాయ, ఇతర కూరగాయలతో తయారు చేసే ప్రసిద్ధ సైడ్ డిష్. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. చాలా రిఫ్రెష్‌గా కూడా ఉంచుతుంది.
మజ్జిగ: దీనిని పెరుగు, నీటితో కలిపి చేస్తారు. మన భారతదేశంలో ప్రసిద్ధ వేసవి పానీయంగా దీనికి పేరుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది.
లస్సీ: ఇది కూడా పెరుగు, నీళ్లతో తయారు చేసే పానీయం. దీనిలో టేస్ట్ కోసం పంచదార వేస్తారు. వేడివాతావరణంలో శరీరం చల్లబడటానికి అద్భుతమైన పరిష్కారం.
తాజా పండ్లు: వేసవి నెలల్లో అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో మామిడిపండ్లు, పుచ్చకాయలు, సీతాఫలాలు లిచీలు తీసుకోవచ్చు.
సలాడ్లు: తాజా కూరగాయలు, పండ్లు, మూలికలతో తయారు చేసే వివిధ రకాల సలాడ్‌లు తీసుకోవాలి. కొబ్బరి నీరు: వేసవి వేడికి మంచి విరుగుడు కొబ్బరి నీరు. ఇది సహజ హైడ్రేటర్ గా పనిచేసి శరీరాన్ని చల్లబరుస్తుంది.
ఇవి అస్సలు తినకండి..
స్పైసీ ఫుడ్స్: స్పైసీ ఫుడ్స్ మీకు చెమట పట్టేలా చేస్తాయి. ఫలితంగా మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా వేడి వాతావరణంలో మరింత వేడిగా అనిపించేలా చేస్తాయి.
భారీ కొవ్వు పదార్ధాలు: కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా వేడి వాతావరణంలో మీకు నీరసంగా అనిపించవచ్చు.
కెఫిన్, ఆల్కహాల్: ఈ రెండూ మూత్రవిసర్జనలు ఎక్కువగా అయ్యేలా చేస్తాయి. ఫలితంగా త్వరగా డీ హైడ్రేట్ అయ్యేలా చేస్తాయి. వేడి వేవ్ సమయంలో ఈ పానీయాల వినియోగాన్ని నివారించడం లేదా పరిమితం చేయడం ఉత్తమం.
ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రాసెస్ చేసిన ఆహారాలు, సోడియం అధికంగా ఉండేవి డీహైడ్రేషన్, నీరు నిలుపుదలకి దారి తీయవచ్చు. ఫలితంగా వేడి వాతావరణంలో ఇవి మీకు మరింత అసౌకర్యాన్ని కల్పిస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







