Child Health: మీ పిల్లలు ఇష్టపడుతున్నారు కదా అని ఈ ఫుడ్స్‌ పెట్టకండి.. చేజేతులా వారి ఆరోగ్యాన్ని పాడుచేయకండి..

అయినప్పటికీ వారికి అవసరమైన న్యూట్రిషన్‌ ఫుడ్‌ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలను దూరంగా ఉంచాలని కొన్ని జంక్‌ ఫుడ్స్‌ జాబితా మీకు ఇస్తున్నాం. వీటిని పిల్లలకు ఎంత దూరం ఉంచితే వారి ఆరోగ్యానికి అంత మంచిది.

Child Health: మీ పిల్లలు ఇష్టపడుతున్నారు కదా అని ఈ ఫుడ్స్‌ పెట్టకండి.. చేజేతులా వారి ఆరోగ్యాన్ని పాడుచేయకండి..
child eating

Updated on: Jun 27, 2023 | 3:30 PM

పిల్లలు తినే ఆహారం విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా పిల్లలు ఏది బడితే అది తినేస్తుంటారు. ఫాస్ట్‌ ఫుడ్స్‌ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇటువంటి సమయంలో వారికి మంచి ఆరోగ్యకరమైన, న్యూట్రిషన్‌ ఫుడ్‌ వారిచేత తినిపించడం అంత సులభమైన పని కాదు. అంతేకాక ఇప్పటి వరకూ వేసవి సెలవులు కారణంగా ఇంటి దగ్గరే ఉంటూ ఇష్టమైన ఆహారం అనువైన సమయంలో తినేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారికి స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. దీంతో వారికి సమయపాలన ముఖ్యం. ఆయా సమయాల్లోనూ వారు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులకు మరింత తలనొప్పి. అయినప్పటికీ వారికి అవసరమైన న్యూట్రిషన్‌ ఫుడ్‌ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలను దూరంగా ఉంచాలని కొన్ని జంక్‌ ఫుడ్స్‌ ని మీకు తెలుపబోతున్నాం. వాటిని పిల్లలకు ఎంత దూరం ఉంచితే పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది. అవేంటో చూద్దాం..

నూడిల్స్‌.. వీటిని ఇష్టపడని పిల్లలు ఉండరేమో! ఇన్‌స్టంట్‌ నూడిల్స్‌ పిల్లలకు అమితంగా తింటుంటారు. దీనిలో రిఫైన్డ్‌ ఫ్లోర్‌, ప్రిజర్వేటివ్స్‌ ఉంటాయి. అంతేకాక చాలా తక్కువ న్యూట్రిషన్‌, కాలరీలు, ఫైబర్‌, ప్రోటీన్‌ ఉంటుంది. అదే సమయంలో అధిక మోతాదులో కొవ్వులు, కార్బ్స్‌, సోడియం, మైక్రో న్యూట్రియంట్స్‌ ఉంటాయి. చాలా కంపెనీల నూడిల్స్‌ లో మోనో సోడియ గ్లూటమేట్‌(ఎంఎస్‌జీ) ఉంటుంది. అది ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌లో వాడే ఎడిటివ్‌. ఈ నూడిల్స్‌ ఎక్కువగా తినడం వల్ల గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయన నిపుణులు చెబుతున్నారు.

నిల్వ ఆహారం.. పిల్లలకు చాలా మంది తల్లిదండ్రులు నిల్వ ఆహారం పెడుతుంటారు. ఉదయం వండినవి రాత్రి, రాత్రి వండినవి మధ్యాహ్నానికి లంచ్‌ బాక్స్‌లో పెడుతుంటారు. అయితే వీటి వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక్కోసారి ఇది ఫుడ్‌ పాయిజన్‌ కు కూడా దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫ్రైడ్‌ ఫుడ్స్‌.. చాలా మంది పిల్లలు ఈ ఫ్రైడ్‌ ఫుడ్స్‌ ను కూడా ఇష్టపడతారు. డీప్‌ ఫ్రైడ్‌ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, పొటాటో చిప్స్‌, ఫ్రైడ్‌ చికెన్‌ వంటి వాటిల్లో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి పిల్లలు అధిక బరువు పెరగడానికి కారణమవుతాయి. అలాగే కడుపులో పేగుల్లో కూడా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలుంటాయి.

సుగరీ ట్రీట్స్‌.. కేండీలు, సుగరీ జెల్లీలు తినడానికి పిల్లలు చాలా ఆనంద పడతారు. అయితే వీటిల్లో అధిక షుగర్‌ ఉండటంతో పాటు కొన్ని రకాల రసాయనాలను ప్రిజర్వేటివ్స్‌గా వినియోగిస్తారు. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ కేండీల స్థానంలో ఫ్రెష్‌ ఫ్రూట్స్‌ పిల్లలకు ఇస్తే వారికి మెండైనా ఆరోగ్యం సొంతం అవుతుంది.

మయోనైజ్‌.. చాలామంది పిల్లలు ఈ మయోనైజ్‌ ని ఇష్టపడతారు. ఈ కోల్డ్ సాస్ని బర్గర్స్, సాండ్విచెస్, సలాడ్స్, కప్ కేక్స్, డిప్స్ వంటి వాటిల్లో వాడుతారు. అయితే ఇవి చాలా అనారోగ్య దాయకమని నిపుణులు చెబుతున్నారు. అధిక కొవ్వులు, ఒక స్పూన్‌ లో 100 కేలరీలు ఉంటాయి. వీలైనంత వరకూ వీటిని దూరం పెట్టాలి.

హెల్దీ ఫుడ్‌ ఏది..

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పిల్లలకు సమతుల్య ఆహారం ఇ‍వ్వాలి. దానిలో మంచి రుచి కూడా ఉండాలి. న్యూట్రిషన్‌, ప్రోటీన్స్‌ కూడా ఉండాలి. అలాంటి ఫుడ్స్‌ అంటే పండ్లు, కూరగాయలు, ఇడ్లీలు, ప్రోటీన్‌ ప్యాక్డ్‌ శ్యాండ్‌ విచ్‌ వంటివి వారికి టిఫిన్‌ లేదా లంచ్‌ బాక్స్‌ లలో పెట్టొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..