Favourite Foods: ముఖేష్, నీతా అంబానీలకు ఇష్టమైన ఫుడ్స్ ఇవే!

ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు తెలియని వారుండరు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడికి ముఖేష్ అంబానీ పేరుగాంచారు. కేవలం డబ్బు పరంగానే కాకుండా.. ఆయన ఐడియాలజీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దేనినైనా భిన్నంగా ఆలోచిస్తూ ముందుంటారు ముఖేష్ అంబానీ. ఏ విషయమైనా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముకేష్ అంబానీతో పాటు నీతా అంబానీ కూడా చాలా పాపులర్. ఫంక్షన్ అయినా పండగైనా.. ఆఫీసు ఓపెనింగ్స్ అయినా..

Favourite Foods: ముఖేష్, నీతా అంబానీలకు ఇష్టమైన ఫుడ్స్ ఇవే!
Mukesh And Nita Ambani

Updated on: Jun 05, 2024 | 3:16 PM

ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు తెలియని వారుండరు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడికి ముఖేష్ అంబానీ పేరుగాంచారు. కేవలం డబ్బు పరంగానే కాకుండా.. ఆయన ఐడియాలజీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దేనినైనా భిన్నంగా ఆలోచిస్తూ ముందుంటారు ముఖేష్ అంబానీ. ఏ విషయమైనా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముకేష్ అంబానీతో పాటు నీతా అంబానీ కూడా చాలా పాపులర్. ఫంక్షన్ అయినా పండగైనా.. ఆఫీసు ఓపెనింగ్స్ అయినా.. ముఖేష్ అంబానీతో పాటు నీతా కూడా ఉంటారు. రీసెంట్‌గా రాధిక మర్చంట్, అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో వీరిద్దరూ ఓ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా సెలబ్రేషన్స్ చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు ప్రపంచంలోని పేరుగాంచిన పలువురు విచ్చేసి సందడి చేశారు. ఈ విషయం పక్కన పెడితే.. అంబానీ దంపతులకు ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. మరి వీరు ఎలాంటి ఆహారం తినడానికి ఆసక్తి చూపిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజిటేరియన్ తినడానికి ఆసక్తి చూపిస్తారు:

అంబానీ దంపతులు ఇద్దరూ ట్రెడిషనల్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తారట. అందులో ముఖ్యంగా వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తింటారట. ఇందులో ముఖ్యంగా గుజరాతీ వంటలు ఖచ్చితంగా ఉండాలట. మోదక్ స్వీట్ అంటే కూడా ఇష్టమేనట.

ఇడ్లీ సాంబార్:

ముఖేష్ అంబానీ తన బ్రేక్ ఫాస్ట్ లేదా డిన్నర్‌లో ఇడ్లీ సాంబార్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారట. ఈయనకు ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టమట. అది కూడా మైసూర్ కేఫ్‌లో లభ్యమయ్యే ఇడ్లీ సాంబార్ అంటే మరింత ఇష్టంగా తింటారట.

ఇవి కూడా చదవండి

గుజరాతీ స్టైల్ వంటకాలు:

వాళ్ల ఫ్యామిలీ నేటివిటీకి తగ్గట్టు.. గుజరాతీ వంటకాలు కూడా తింటారట. గుజరాతీ స్టైల్‌లో చేసే పప్పు అంటే చాలా ఇష్టమట. వీరిద్దరూ ఫ్యూర్ వెజిటేరియన్లు. అలాగే వీరి వంటల్లో తక్కువ నూనె, తక్కువ మసాలాలు ఉండేలా చూసుకుంటారు.

దహీ పూరీ:

అంబానీ దంపతులకు స్నాక్స్‌లో ఎక్కువగా ఇష్ట పడి తినే వాటిల్లో దహీ పూరీ అంటే ఇష్టంగా తింటారట. భేల్ పూరీ కూడా తింటారట. అలాగే పండ్ల రసాలు కూడా తీసుకుంటూ ఉంటారు. నీతా అంబానీ ప్రతి రోజూ ఉదయం బీట్ రూట్ జ్యూస్ తాగుతారట.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..