Lifestyle: ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటున్నారా.? ‘డెడ్‌ బట్‌ సిండ్రోమ్‌’ తప్పదు..

|

Oct 19, 2024 | 10:39 AM

గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేస్తున్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువవుతోంది. అయితే ఇలా గంటలతరబడి కూర్చొని ఉండడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యనే డెడ్ బట్ సిండ్రోమ్ గా చెబుతుంటారు. ఇంతకీ ఏంటీ సమస్య.? దీనికి పరిష్కారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటున్నారా.? డెడ్‌ బట్‌ సిండ్రోమ్‌ తప్పదు..
Lifestyle
Follow us on

గంటలతరబడి కదలకుండా ఒకే చోట కూర్చునే వారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగం, వ్యాపారం ఇలా గంటలతరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. ఎక్కువసేపు ఒకేచోట ముఖ్యంగా ఒకే భంగిమంలో కూర్చోవడం వల్ల సమస్యలు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా 45 నిమిషాల కంటే ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం చాలా ప్రమాదకరం.

ఇలా ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల డెడ్ బట్ సిండ్రోమ్ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ డెడ్ బట్ సిండ్రోమ్‌ అంటే ఏటి.? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి.? ఈ సమస్య బారిన పడినట్లు తెలుసుకునే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా సమయం తర్వాత ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి.

డెడ్ బట్ సిండ్రోమ్‌ను గ్లుటియల్ మతిమరుపు అని కూడా అంటారు. ఈ సమస్య వల్ల తుంటి ప్రదేశంలో తిమ్మిరి వస్తుంది. ఆ పార్ట్ కొంతసేపు పనిచేయడం ఆగిపోతుంది. డెడ్‌ బట్ సిండ్రోమ్‌ సమస్య వల్ల వీపు, మోకాలుతో పాటు చీలమండలలో తీవ్రమైన నొప్పి వస్తుంది. హిప్ స్ట్రెయిన్‌తో పాటు.. తుంటి కింది భాగంలో జలదరింపుగా అనిపిస్తుంది. తుంటి చుట్టూ తిమ్మిరి, మంట, నొప్పి వేధిస్తుంది.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం మానుకోవాలి. కనీసం 20 నిమిషాలకు ఒకసారైనా పైకి లేకి కూర్చోవాలి. అదే విధంగా ఆఫీసుల్లో, ఇంట్లో లిఫ్ట్ ఉపయోగాన్ని తగ్గించాలి, మెట్లను ఉపయోగించాలి. అలాగే జీవితంలో వాకింగ్‌ను అలవాటు చేసుకోవాలి. ప్రతీ రోజూ కచ్చితంగా 30 నిమిషాలైనా వాకింగ్ చేయాలి. అలాగే వర్క్‌ చేస్తున్న సమయంలో అప్పుడప్పుడు లేచి స్ట్రెచ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేస్తుండాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..