Health: వారం రోజుల ముందే బ్రెయిన్ స్ట్రోక్‌ను పసిగట్టవచ్చు.. ఎలాగంటే..

|

Feb 29, 2024 | 2:43 PM

మెదడుకు సరైన రక్త సరఫరా లేకపోవడం, మెదడులోని రక్త నాళాలు పగిలిపోతాయి, దీని కారణంగా ఆక్సిజన్ సరిగ్గా చేరుకోలేక మెదడు పని చేయడం ఆగిపోతుంది. దీనినే బ్రెయిన్‌ స్టోక్‌ అంటారు. ఇలాంటి సమయంలో తక్షణ చికిత్స అందకపోతే ప్రాణం కూడా పోతుంది. అయితే, స్ట్రోక్ ఎప్పుడూ అకస్మాత్తుగా...

Health: వారం రోజుల ముందే బ్రెయిన్ స్ట్రోక్‌ను పసిగట్టవచ్చు.. ఎలాగంటే..
Brain Stroke
Follow us on

మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవల బ్రెయిన్‌ స్ట్రోక్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మెదడుకు సరైన రక్త సరఫరా లేకపోవడం, మెదడులోని రక్త నాళాలు పగిలిపోతాయి, దీని కారణంగా ఆక్సిజన్ సరిగ్గా చేరుకోలేక మెదడు పని చేయడం ఆగిపోతుంది. దీనినే బ్రెయిన్‌ స్టోక్‌ అంటారు. ఇలాంటి సమయంలో తక్షణ చికిత్స అందకపోతే ప్రాణం కూడా పోతుంది. అయితే, స్ట్రోక్ ఎప్పుడూ అకస్మాత్తుగా సంభవించదు. స్ట్రోక్‌ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఓ అధ్యయనం ప్రకారం స్ట్రోక్ వచ్చిన వారిలో 43 శాతం మంది స్ట్రోక్‌కు ఒక వారం ముందు లక్షణాలను అనుభవించారని తేలింది. ఇంతకీ వారం ముందు కనిపించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* స్ట్రోక్‌ వచ్చే ఒక వారం ముందు కనిపించే లక్షణాల్లో చేతులు, కాళ్ళలో బలహీనత ప్రధానమైంది.ఈ రెండు భాగాలలో తిమ్మిరి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* స్ట్రోక్‌కు ముందు జ్ఞాపకశక్తి కూడా ప్రభావితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయాల్లో పాత విషయాలు గుర్తుకు రాకపోవడం లేదా దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి.

* స్ట్రోక్‌ వచ్చే 7 రోజుల ముందు తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు. ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా తరచుగా తల తిరుగుతున్న భావన కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

* స్ట్రోక్ వచ్చే ముందు కంటి చూపుపై కూడా ప్రభావం పడుతుంది. అకస్మాత్తుగా దృష్టి తగ్గినా, కంటి చూపు అస్పష్టంగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

* స్పష్టంగా మాట్లాడలేకపోవడం కూడా అనే స్ట్రోక్‌కు 7 రోజుల ముందు కనిపించే లక్షణాల్లో ఒకటి. మాట సరిగ్గా రాకపోయినా, పదాలను స్పష్టంగా పలకలేకపోతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* స్ట్రోక్‌కి ఒక వారం ముందు, శరీర సమతుల్యత దెబ్బతినవచ్చని నిపుణులు చెబుతున్నారు. నడవడానికి ఇబ్బందిగా అనిపించినా వైద్యులను సంప్రదించి, అవసరమైన చికిత్స తీసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..