
ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోన్న సమస్యల్లో మధుమేహం ఒకటి. ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా భారత్‌లో షుగర్ పేషెంట్స్ ఎక్కువువతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించే ఈ సమస్య ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండని వారిలో కనిపిస్తోంది. అయితే తాజాగా చిన్నారుల్లో కూడా మధుమేహం రావడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే చిన్నారుల్లో మధుమేహం రావడానికి కారణాలు ఏంటి.? ఏ లక్షణాల ద్వారా దీనిని గుర్తించవచ్చు.? ఎలాంటి జాగ్రత్తగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో మధుమేహం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇది భారత్‌లోనూ ఆందోళన కలిగించే అంశంగా మారింది. శరీరంలో రక్తంలో చక్కెర పెరుగుదల ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే మధుమేహాన్ని సైలెంట్ కిల్లర్‌గా పిలుస్తుంటారు. అయితే పిల్లల్లో ఈ వ్యాధి రావడానికి కారణం కేవలం జన్యుపరమైన కారణాలే కాకుండా తల్లిదండ్రుల తప్పిదాలు కూడా అని మీకు తెలుసా.
చిన్నారుల్లో కొన్ని లక్షణాల ద్వారా మధుమేహాన్ని ముందుగానే గుర్తించవచ్చు వీటిలో ప్రధానమైనవి. అధిక దాహం వేయడం, తరచుగా మూత్రవిసర్జన చేయడం, అధిక ఆకలి, బరువు తగ్గడం, అలసట, అస్పష్టమైన దృష్టి, నెమ్మదిగా గాయం మానడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఇక చాలా మంది పేరెంట్స్ తమ చిన్నారులకు కుకీలు, క్యాండీలు, పేస్ట్రీలు వంటివి తినిపిస్తుంటారు. ఇవి చిన్నారుల్లో షుగర్ లెవల్స్ పెరగడానికి కారణాలు చెబుతున్నారు.
వీటిలో ఉపయోగించే ఆర్టిషిషియల్ షుగర్స్ వల్లే ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చిన్నారులకు చిప్స్, పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్‌ను అలవాటు చేయడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అధిక కేలరీలు ఉండే ఆహార పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే కూల్ డ్రింక్స్‌ను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని అంటున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..