Blood Pressure Control: బీపీని కంట్రోల్ చేసే బెస్ట్ డ్రింక్స్ ఇవే.. డోంట్ మిస్!

|

Oct 09, 2024 | 4:05 PM

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల్లో అధిక రక్త పోటు కూడా ఒకటి. బీపీ అనేది సాధారణ సమస్యగా మారింది. రక్తపోటును కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే రక్త పోటు కారణంగా మెదడు, గుండెపై నేరుగా ప్రభావం పడుతుంది. రక్త పోటు పెరగడం వల్ల గుండెపై కూడా ఎఫెక్ట్ పడి.. హార్ట్ ఎటాక్ వంటి వాటికి దారి తీయవచ్చు. ఈ వ్యాధిని నియంత్రించాలంటే సరైన ఆహారం..

Blood Pressure Control: బీపీని కంట్రోల్ చేసే బెస్ట్ డ్రింక్స్ ఇవే.. డోంట్ మిస్!
అలాగే తక్కువ రక్తపోటుతో బాధపడేవారు తమ ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోవచ్చు. గుడ్లు, పాలు, చేపలు, ద్రాక్ష, అరటిపండు, కివి, సూప్, ధాన్యాలు, సోడియం అధికంగా ఉండే ఆహారాలు రోజువారీ ఆహారంలో తీసుకోవచ్చు. అలాగే క్రమం తప్పకుండా రక్తపోటును తనిఖీ చేసుకుంటూ ఉండాలి.
Follow us on

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల్లో అధిక రక్త పోటు కూడా ఒకటి. బీపీ అనేది సాధారణ సమస్యగా మారింది. రక్తపోటును కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే రక్త పోటు కారణంగా మెదడు, గుండెపై నేరుగా ప్రభావం పడుతుంది. రక్త పోటు పెరగడం వల్ల గుండెపై కూడా ఎఫెక్ట్ పడి.. హార్ట్ ఎటాక్ వంటి వాటికి దారి తీయవచ్చు. ఈ వ్యాధిని నియంత్రించాలంటే సరైన ఆహారం, చికిత్స తీసుకోవాలి. తినే ఆహారాల ద్వారా కూడా మనం బీపీని తగ్గించుకోవచ్చు. అధిక రక్త పోటు సమస్యతో బాధ పడేవారు కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. మరి ఆ పానీయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉసిరి రసం:

రక్త పోటును తగ్గించడంలో ఉసిరి రసం ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త నాళాలను విస్తరింప జేసి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఉసిరి రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల రక్త పోటు అనేది నియంత్రణలో ఉంటుంది.

కొబ్బరి నీళ్లు:

అధిక రక్త పోటుతో బాధ పడేవారు ప్రతి రోజూ ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు నిండి ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్, పొటాషియం అధికంగా లభిస్తాయి. ఇవి రక్త నాళాల్లోని సోడియం కంటెంట్‌ని తగ్గించి.. బీపీని నార్మంలో చేయడం హెల్ప్ చేస్తుంది. కాబట్టి బీపీ సమస్యతో బాధ పడేవారు కొబ్బరి నీటిని తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

బీట్‌రూట్ రసం:

ప్రతి రోజూ బీట్ రూట్ రసం తాగడం వల్ల కూడా బీపీని కంట్రోల్ చేయవచ్చు. ఇది శరీరంలోని నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. ఇది శరీరంలోని రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. దీని వల్ల రక్త పోటు అనేది నార్మల్ అవుతుంది.

పుదీనా రసం:

పుదీనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున పుదీనా రసం తాగితే జుట్టు, చర్మం, ఆరోగ్యం ఉంటాయి. రక్త ప్రసరణను మెరుగు పరచడంలో పుదీనా రసం సహాయ పడుతుంది. అదే విధంగా జామకాయ రసం, మజ్జిగ, దాల్చిన చెక్క నీళ్లు, అల్లం జ్యూస్ తాగినా బీపీ కంట్రోల్ అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..