Liver Disease : చర్మంపై దురద, మంట, దద్దుర్లు వంటి సమస్యలను సాధారణంగా మనం విస్మరిస్తాం. అయితే కొన్నిసార్లు ఈ సమస్యలు కూడా కొన్ని వ్యాధికి సంకేతంగా ఉంటాయి. కాలేయానికి సంబంధించిన సమస్యలకు ఇటువంటి లక్షణాలే కనిపిస్తాయి. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం.
1. కాలేయంలో దెబ్బతిన్న లక్షణం రక్తంలో పిత్త ఏర్పడటం. అటువంటి పరిస్థితిలో చర్మంపై దురద సమస్య మొదలవుతుంది. వాస్తవానికి కాలేయం పనిచేయకపోవడం ప్రారంభించినప్పుడు పిత్త రక్తంలో కలవడం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా దురద సమస్య వస్తుంది.
2. కళ్ళు, చర్మం, గోర్లు పసుపు రంగుకు మారడం కూడా కాలేయ వ్యాధికి లక్షణం. మూత్రం పసుపు రంగులో రావడం కూడా కాలేయం పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది.
3. కాలేయం సరిగా పనిచేయనప్పుడు ఈస్ట్రోజెన్ పరిమాణం పెరుగుతుంది. ఈ కారణంగా టైరోనేస్ అనే మూలకం శరీరంలో పెరుగుతుంది. అందువల్ల చర్మంపై గోధుమ లేదా నల్ల మచ్చలు కనిపిస్తాయి. చర్మంపై ఇలాంటి సమస్యలు కనిపిస్తే దానిని విస్మరించవద్దు.
4. శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరిగినప్పుడు స్పైడర్ వెబ్ వంటి చిన్న కణాలు చర్మంపై కనిపిస్తాయి. వీటిని స్పైడర్ యాంజియోమాస్ అంటారు. ఇది వ్యక్తి కాలేయం సరిగా పనిచేయడం లేదు అనే సంకేతాన్ని సూచిస్తుంది.
5. నీలం రంగు దద్దుర్లు తరచుగా చర్మంపై కనిపిస్తాయి. వాటిని ఎవ్వరు పట్టించుకోరు కానీ ఇలా జరిగితే కాలేయం సమస్య ఉన్నట్లు అర్థం. మీ కాలేయం ప్రోటీన్లను ఉత్పత్తి చేయడంలేదని సూచన.
6. అరచేతిలో తరచుగా మంట, దురద అంటే మీ శరీరంలోని హార్మోన్లు అసమతుల్యమవుతున్నాయి. ఇవి కాలేయ వైఫల్యాన్ని సూచిస్తాయి.
7. పొత్తి కడుపులో వాపు కూడా కాలేయ వైఫల్యానికి సంకేతం. ఈ లక్షణాన్ని విస్మరించే పొరపాటు చేయకండి వెంటనే నిపుణుడిని సంప్రదించండి.