AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of raw papaya: బొప్పాయి.. చాలా గొప్పోయి.. ఈ ఒక్క పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? అస్సలు మిస్ అవ్వద్దు..

పచ్చి బొప్పాయి చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో బాగా ఉపకరిస్తుంది. ఇంకా జీర్ణ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. కీళ్ల సమస్యలకు చెక్‌ పెడుతుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది.

Benefits of raw papaya: బొప్పాయి.. చాలా గొప్పోయి.. ఈ ఒక్క పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? అస్సలు మిస్ అవ్వద్దు..
Papaya
Madhu
|

Updated on: Feb 14, 2023 | 9:55 AM

Share

బొప్పాయి పోషకాల గని.. అది అందించినన్ని ఆరోగ్య ప్రయోజనాలు మరే ఇతర పండు ఇవ్వలేదు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ ఇంకా ఇతర పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయిలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలుండటం విశేషం. ఇందులో విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్ వంటి మినరల్స్ ఉన్నాయి. సాధారణంగా పండిన బొప్పాయిని ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే పచ్చి బొప్పాయి, బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే ఫైబర్‌ కంటెంట్‌,యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రక్త ప్రసరణ బాగా జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాక పచ్చి బొప్పాయి చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో బాగా ఉపకరిస్తుంది. ఇంకా జీర్ణ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. కీళ్ల సమస్యలకు చెక్‌ పెడుతుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది.

పచ్చి బొప్పాయితో అద్భుత ప్రయోజనాలు..

జీర్ణక్రియకు తోడ్పాటు.. పచ్చి బొప్పాయి ఆహారాన్ని సజావుగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో పాపైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది కడుపులోపల గ్యాస్ట్రిక్ జ్యూస్ లేకపోయినా దాని స్థానాన్ని భర్తీ చేస్తుంది. అలాగే పేగులలో చికాకు, కడుపులో ఇబ్బందికర పరిస్థితిని అధిగమించడానికి సాయపడుతుంది.

చర్మ ఆరోగ్యానికి.. పచ్చి బొప్పాయి తీసుకోవడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి. ఆకుపచ్చ బొప్పాయిని సమయోచితంగా ఉపయోగించడం వల్ల సోరియాసిస్, మొటిమలు, స్కిన్ పిగ్మెంటేషన్, చిన్న చిన్న మచ్చలు లేదా ఎర్రబడిన చర్మంలో అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. బొప్పాయి పండును గుజ్జు చేసి, కాలిన గాయాలకు పూయవచ్చు. ఇది ఇన్ఫెక్షన్ అభివృద్ధి చెందకుండా అరికడుతుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడంలో.. బరువు తగ్గడానికి పచ్చి బొప్పాయిని చాలా మంది ఉపయోగిస్తారు. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సాయపడుతుంది.

పీరియడ్స్‌ నొప్పిని తగ్గిస్తుంది.. బొప్పాయి పోషక ప్రయోజనాలు మహిళలకు మరింత ఉపయోగకరంగా ఉంటాయి. బొప్పాయి ఆకులు పీరియడ్స్‌ నొప్పికి నివారణగా పనిచేస్తాయి. మీరు బొప్పాయి ఆకు, చింతపండు, ఉప్పును నీటితో కలిపి తీసుకోవచ్చు. వాపును తగ్గిస్తుంది.. ఆస్తమా, ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న రోగులకు ప్రయోజనం చేకూర్చే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పచ్చి బొప్పాయిలో ఉన్నాయి. ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల వాపును తగ్గించే విటమిన్ ఎ కూడా ఇందులో ఉంది. తాజా ఆకుపచ్చ బొప్పాయి రసం కూడా ఎర్రబడిన టాన్సిల్స్‌కు చికిత్స చేయగలదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..