లైఫ్‌లో కిక్ పోయిందని ఫీలవుతున్నారా? ఇలా చేస్తే డబుల్ ఎనర్జీతో వర్క్ చేయచ్చు

నేటి ఫాస్ట్ ఫేస్డ్ ప్రపంచంలో క్విక్ రెస్పాన్స్, క్విక్ ఔట్‌పుట్ అంటూ పరుగులు తీసి.. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్ తప్పి సతమతమవుతున్నారా? స్ట్రెస్, అనారోగ్యం, కుటుంబ కలహాలు వెల్లువలా ముంచెత్తుతున్నాయా? అయితే మీరు కచ్చితంగా విరామం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పరిశోధకుల మాటల్లో చెప్పాలంటే, కనీసం రెండు నెలలకు ఒకసారి చిన్న విహారయాత్ర మీ జీవితానికి సరికొత్త ఊపిరిని పోస్తుంది. అసలు వెకేషన్లు మన పనితీరును, మానసిక స్థితిని ఎలా మార్చేస్తాయో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

లైఫ్‌లో కిక్ పోయిందని ఫీలవుతున్నారా? ఇలా చేస్తే డబుల్ ఎనర్జీతో వర్క్ చేయచ్చు
Frequent Short Vacations

Updated on: May 23, 2026 | 9:15 PM

‘క్విక్.. క్విక్’ అనుకుంటూ పరిగెత్తే ఈ ఆధునిక పని సంస్కృతిలో చాలామంది జీవితంలో అసలైన కిక్ కోల్పోతున్నారు. ఆఫీసు డెడ్ లైన్లు, నిరంతర ఒత్తిడి శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని క్షీణింపజేస్తున్నాయా? అయితే ‘Maximising Recovery’ పేరుతో వచ్చిన ఒక అధ్యయనం మీ కోసం ఒక అద్భుతమైన మార్గాన్ని సూచిస్తోంది. ఏడాదికి ఒకేసారి పెద్ద ట్రిప్ ప్లాన్ చేసేకంటే, రెండు నెలలకు ఒకసారి చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో, పని ఒత్తిడి నుంచి బయటపడటం ఎలాగో తెలుసుకుందాం.

నిరంతర పని ఒత్తిడి క్రమంగా మన శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను పెంచి, మానసిక అలసటకు దారితీస్తుంది. ఇది బర్న్‌అవుట్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, ప్రొడక్టివిటీని గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి, హై-ప్రొఫైల్ లైఫ్ అయినా, సాధారణ ఉద్యోగమైనా మధ్యమధ్యలో విరామం తీసుకోవడం అత్యంత ఆవశ్యకం.

రెండు నెలలకో చిన్న బ్రేక్..

ఒకేసారి ఎక్కువ రోజులు సెలవులు తీసుకోవడం కంటే, ప్రతి రెండు నెలలకు ఒకసారి నాలుగు నుండి ఏడు రోజుల పాటు చిన్నపాటి విహారయాత్రలు చేయడం వల్ల ఒత్తిడి పెరగకుండా నిరోధించవచ్చు. అధ్యయనం ప్రకారం, సెలవుల్లో పని గురించి ఆలోచించకుండా పూర్తిగా విరామం తీసుకున్న వారు, తిరిగి ఆఫీసులో చేరినప్పుడు వారి పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ పెరుగుతుందని తేలింది.

గుర్తుంచుకోవాల్సిన నియమాలు

  • పనిని దూరం పెట్టండి: సెలవుల్లో ఇమెయిల్‌లు, ఫోన్ కాల్స్ లేదా వర్క్ కమ్యూనికేషన్లను పూర్తిగా అవాయిడ్ చేయాలి. మీరు పని గురించి ఆలోచించినంత వరకు విరామం దొరకదు.
  • క్రియేటివ్ యాక్టివిటీస్: జర్నీలో కొత్త ప్రదేశాలను అన్వేషించడం, శారీరక వ్యాయామం, సోషలైజింగ్ లేదా మీ పాత హాబీలను కొనసాగించడం వల్ల మెదడుకు కొత్త ఉత్తేజం కలుగుతుంది.
  • వారాంతపు పరిమితి: సెలవులు ఎక్కువ రోజులు ఉంటేనే మంచిది అని చాలామంది భ్రమపడుతుంటారు, కానీ అధ్యయనం ప్రకారం ఎనిమిదవ రోజు తర్వాత తిరిగి మానసిక స్థితి డౌన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గరిష్టంగా వారం రోజులు సెలవులు తీసుకోవడమే మేలు.

కంపెనీల బాధ్యత కూడా..

తరచుగా సెలవులు తీసుకోవడం వల్ల ఉద్యోగి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, కంపెనీకి కూడా మంచి ఔట్‌పుట్ లభిస్తుంది. కాబట్టి ఉద్యోగులు విరామం తీసుకోవడానికి ఆఫీసులు ప్రోత్సహించాలి. ఆరోగ్యకరమైన వాతావరణం, సమతుల్య జీవనం ఉన్నప్పుడే ఒక సంస్థ వృద్ధి చెందుతుంది.

వెకేషన్ అనేది కేవలం విలాసం కాదు, అది మీ పనితీరును పెంచుకునే ఒక పునరుద్ధరణ ప్రక్రియ. కాబట్టి మీ వర్క్ క్యాలెండర్‌లో రెండు నెలలకోసారి నాలుగు రోజులు ఖాళీ చేసుకోండి. ఆ చిన్నపాటి విరామం మీకు ఇచ్చే శక్తి, ఉత్సాహం మీ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. మీ పర్సనల్ లైఫ్‌లో కిక్కును తిరిగి పొందండి!

Follow Us