Beauty Tips: ముఖానికి ఈ నూనె రాస్తే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయ్..! మెరిసే అందం మీ సొంతం..

|

May 16, 2024 | 9:36 PM

బాదం నూనె సహాయంతో మెటిమల గుర్తులు, మచ్చలు క్రమంగా తగ్గుతాయి. ఇది చర్మం టోన్, ఆకృతిని మెరుగుపరుస్తుంది. మీ స్కిన్‌కేర్‌ రోటిన్‌లో బాదం నూనెను ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన, మరింత కాంతివంతంగా కనిపించే చర్మాన్ని పొందుతారు. ప్రతిరోజూ మీ చర్మానికి బాదం నూనెను అప్లై వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

Beauty Tips: ముఖానికి ఈ నూనె రాస్తే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయ్..! మెరిసే అందం మీ సొంతం..
Almond Oil Benefits
Follow us on

బాదం నూనె అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆల్మండ్‌ ఆయిల్‌ చర్మ ఆరోగ్యానికి సహజమైన పవర్‌హౌస్. ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని లోతుగా పోషించి హైడ్రేట్ చేస్తాయి. ఇది ఎరుపును తగ్గించడానికి, చికాకు నుండి ఉపశమనానికి కూడా సహాయపడుతుంది. బాదం నూనె సహాయంతో మెటిమల గుర్తులు, మచ్చలు క్రమంగా తగ్గుతాయి. ఇది చర్మం టోన్, ఆకృతిని మెరుగుపరుస్తుంది. మీ స్కిన్‌కేర్‌ రోటిన్‌లో బాదం నూనెను ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన, మరింత కాంతివంతంగా కనిపించే చర్మాన్ని పొందుతారు. ప్రతిరోజూ మీ చర్మానికి బాదం నూనెను అప్లై వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

1. చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది: బాదం నూనెలో విటమిన్ E సమృద్ధిగా ఉంటుంది. తేలికైనది, త్వరగా శోషించబడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. తేమను నిలుపుతుంది. పొడిని తగ్గిస్తుంది. కాలిస్‌లను మృదువుగా చేస్తుంది. ఇది చర్మ సమస్యల్ని తగ్గించడమే కాకుండా యూవీ రేడియేషన్ దెబ్బతినకుండా చర్మాన్ని కాపాడుతుంది. చర్మం తేమను కాపాడుతుంది.

2. గ్లోయింగ్ స్కిన్: బాదం నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ప్రకాశవంతమైన చర్మాన్ని, సహజ సౌందర్యాన్ని అందజేస్తుంది. బాదం నూనెలోని విటమిన్ ఇ చర్మానికి నిగారింపునిస్తుంది. చర్మం ముడతలను తగ్గిస్తుంది. వృద్ధాప్య చాయలను దూరం చేస్తుంది. బాదం నూనె ముఖానికి, చర్మానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది. కాబట్టి, బాదం నూనెని చర్మానికి ముఖానికి రాయడం మంచిది.

ఇవి కూడా చదవండి

3. మొటిమలను తగ్గిస్తుంది: మొటిమలకు ప్రధాన కారణం అదనపు సెబమ్. ఇది బాదం నూనెతో క్లీర్ అవుతుంది. అలాగే, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, ఎమోలియెంట్ గుణాలు మొటిమల వల్ల ఏర్పడే స్కిన్ టోన్ అసమానతలను సరిచేయడంలో సహాయపడతాయి. ఇది కంటికింద భాగంలో వాపుని తగ్గిస్తుంది. బాదం నూనె యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌కి మూలం. ఇది చర్మ వాపును తగ్గించేందుకు సాయపడుతుంది.

4. కళ్లకింద వాపు, నల్లటి వలయాలకు: ఇది కంటికింద భాగంలో వాపుని తగ్గిస్తుంది. బాదం నూనె యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌కి మూలం. ఇది చర్మ వాపును తగ్గించేందుకు సాయపడుతుంది. కళ్ల కింద ముడతలు, నల్లటి వలయాలను తగ్గిస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం, రాత్రిపూట వాడండి. ఉదయం కడిగేయండి.

5. సన్‌బర్న్‌ను తగ్గిస్తుంది: బాదం నూనెలోని విటమిన్ ఇ సన్‌బర్న్‌కు కారణమయ్యే UV రేడియేషన్ ప్రభావాలను తగ్గిస్తుంది. అదనంగా, ఇది సన్బర్న్ మరియు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..