ఇంటి అందాన్ని నల్లటి గోడలు మార్చేస్తున్నాయా? రీజన్‌ ఇట్టే కనిపెట్టేయొచ్చు

ఇంటి గోడలపై అప్పుడప్పుడు నల్లటి మచ్చలు లేదా తేమ కనిపిస్తూ ఉండటం మనం చూస్తుంటాం. అయితే, ఇది వంటగదిలోని స్టీమ్ (ఆవిరి) వల్ల వచ్చిందా లేక గోడ వెనుక ఉన్న పైపుల నుండి నీరు లీక్ అవుతుందా అనేది తేల్చుకోవడం చాలా కష్టం. ఈ గందరగోళానికి చెక్ పెట్టడానికి ఆర్కిటెక్ట్‌లు, బిల్డింగ్ నిపుణులు ఒక సులువైన చిట్కాను చెబుతున్నారు. కేవలం ఒక అల్యూమినియం ఫాయిల్ ముక్కతో 24 నుండి 48 గంటల్లో ఈ సమస్యకు గల అసలు కారణాన్ని తెలుసుకోవచ్చు.

ఇంటి అందాన్ని నల్లటి గోడలు మార్చేస్తున్నాయా? రీజన్‌ ఇట్టే కనిపెట్టేయొచ్చు
Wall Moisture And Leakage Issues At Home.jpg

Updated on: Jun 16, 2026 | 8:00 PM

చామర్స్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల ప్రకారం, గోడల్లోని తేమను గుర్తించడానికి అల్యూమినియం ఫాయిల్ ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది. తేమ ఉన్న చోట ఈ ఫాయిల్‌ను అంటించడం ద్వారా అక్కడ గాలి చొరబడకుండా, నీరు ఆవిరి కాకుండా ఆగిపోతుంది. దీనివల్ల నీటి చుక్కలు ఎటువైపు నుండి వస్తున్నాయనేది స్పష్టంగా తెలుస్తుంది. ఖరీదైన టూల్స్ వాడే ముందు ఇదొక మంచి ప్రాథమిక పరీక్షగా ఉపయోగపడుతుంది.

ఎలా అర్థం చేసుకోవాలి?

  • గోడపై తేమ ఉన్న చోట 12 ఇంచుల అల్యూమినియం ఫాయిల్ ముక్కను తీసుకుని, నాలుగు వైపులా గాలి వెళ్లకుండా గట్టిగా టేప్ వేయాలి. రెండు రోజుల తర్వాత దానిని తీసి పరిశీలించాలి.
  • గోడ లోపలి లీకేజీ- ఒకవేళ ఫాయిల్ లోపలి వైపు (గోడకు అంటుకుని ఉన్న వైపు) తేమ ఉంటే, గోడ లోపల పైపుల లీకేజీ లేదా వర్షపు నీరు లోపలికి రావడం వల్ల ఈ సమస్య వస్తుందని అర్థం. కొన్నిసార్లు తెల్లటి పౌడర్ లాంటి పదార్థం (ఎఫ్లోరోసెన్స్) కనిపిస్తే, గోడల్లోకి నీరు బాగా చేరిందని గుర్తించాలి.
  • గదిలోని తేమ- అదే ఫాయిల్ బయటి వైపు (గది వైపు) తడిగా ఉంటే, అది గదిలోని హ్యుమిడిటీ లేదా కాండెన్సేషన్ వల్ల వచ్చిన తేమ అని గుర్తించవచ్చు. గదిలో గాలి వెలుతురు సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గదిలోని తేమ సమస్య అయితే, కిచెన్, బాత్‌రూమ్‌లలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడాలి. ఇంట్లో తేమ శాతాన్ని 30 నుండి 50 లోపు ఉంచుకుంటే గోడలు చెమర్చవు. అప్పుడప్పుడు కిటిкіలు తెరవడం, డీహ్యుమిడిఫైయర్ వాడటం వల్ల ఇల్లు పొడిగా మారుతుంది. ఒకవేళ గోడ లోపల లీకేజీ ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్లంబింగ్ నిపుణులను సంప్రదించాలి. ఎందుకంటే, తేమ ఉన్న చోట 24 నుండి 48 గంటల్లోనే ప్రమాదకరమైన బూజు (మోల్డ్) పట్టే అవకాశం ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), CDC నివేదికల ప్రకారం, గోడలపై పెరిగే బూజు శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. ఇది ఆస్తమా, దగ్గు, అలర్జీలను పెంచుతుంది. అందుకే గోడలపై మచ్చలు కనిపించిన వెంటనే అల్యూమినియం ఫాయిల్ టెక్నిక్‌తో కారణాన్ని తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. మీ ఇంటి గోడలను, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ చిన్న చిట్కాను ఈరోజే ప్రయత్నించి చూడండి!

Follow Us