Tea vs Coffee: టీ vs కాఫీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?

|

Jun 08, 2024 | 5:26 PM

టీ లేదా కాఫీ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. చాలా మందికి ఈ రెండూ అంటే ప్రాణం. ఉదయం, సాయంత్రం ఓ సిప్ పడనిదే.. ప్రాణం నిలవదు. టీ, కాఫీలు తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. ఎక్కువగా తాగితే అంతే ప్రమాదం కూడా. టీ, కాఫీలతోనే చాలా మంది డే స్టార్ట్ అవుతుంది. అయితే కాఫీ కంటే చాలా మంది టీనే ఎక్కువగా తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. టీ లేదా కాఫీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన..

Tea vs Coffee: టీ vs కాఫీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
Tea Vs Coffee
Follow us on

టీ లేదా కాఫీ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. చాలా మందికి ఈ రెండూ అంటే ప్రాణం. ఉదయం, సాయంత్రం ఓ సిప్ పడనిదే.. ప్రాణం నిలవదు. టీ, కాఫీలు తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. ఎక్కువగా తాగితే అంతే ప్రమాదం కూడా. టీ, కాఫీలతోనే చాలా మంది డే స్టార్ట్ అవుతుంది. అయితే కాఫీ కంటే చాలా మంది టీనే ఎక్కువగా తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. టీ లేదా కాఫీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. నిద్ర మత్తు వదులుతుంది. కొత్తగా ఎనర్జీ వస్తుంది. తల నొప్పికి బైబై చెప్పొచ్చు. అలసట, నీరసాన్ని కూడా వదిలించుకోవచ్చు. ఇలా ఒక్కటేంటి.. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది తాగితే ఆరోగ్యానికి ఎక్కువ మంచిది? ఏది తాగడం బెటర్? ఇప్పుడు తెలుసుకుందాం.

టీ:

టీ లేదా కాఫీ అన్నా చాలా మందికి ఇష్టమే. అయితే ఎక్కువగా చాలా మంది ఛాయ్ తాగడానికి మక్కువ చూపిస్తారు. పూర్వం నుంచి టీ తాగుతూ ఉంటారు. వేడి నీళ్ల తర్వాత ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందింది టీ. టీలో ఎన్నో రకాలు, ఫ్లేవర్స్ ఉన్నాయి. టీ ఆరోగ్యకరమైన పానీయంగా పేరు పొందింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. మితంగా తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే టీలో తాగడం వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే.. ఇందులో కెఫిన్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. టీ తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇలా చాలా లాభాలే ఉన్నాయి.

కాఫీ:

కాఫీ తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కూడా శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను నశింప చేస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన సమస్యలను తగ్గిస్తుంది. కాఫీ తాగడం వల్ల హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఏది మంచిది?

కాఫీ, టీ రెండూ ఆరోగ్యానికి మంచివేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏది తాగినా మంచిదే. అయితే మరీ ఎక్కువగా కాకుండా.. మితంగా తీసుకోవడం ఉత్తమం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..