Curd in Rainy Season: మీకు పెరుగు తినడం ఇష్టమా.. వర్షాకాలంలో పెరుగు తింటే కష్టం.. ఎందుకో తెలుసా?

చాలామందికి పెరుగు అంటే ఇష్టం. గడ్డపెరుగు ఒక్క ముద్దలోకైనా లేకపోతే వారికీ భోజనం చేసినట్టే ఉండదు. కొంతమంది పెరుగును అలాగే తినడానికి ఇష్టపడతారు. పెరుగు ఆరోగ్యానికి మంచిదే కానీ, మితంగా తీసుకుంటేనే అంటారు వైద్యనిపుణులు.

Curd in Rainy Season: మీకు పెరుగు తినడం ఇష్టమా.. వర్షాకాలంలో పెరుగు తింటే కష్టం.. ఎందుకో తెలుసా?
Curd In Rainy Season

Updated on: Jul 29, 2021 | 10:51 AM

Curd in Rainy Season: చాలామందికి పెరుగు అంటే ఇష్టం. గడ్డపెరుగు ఒక్క ముద్దలోకైనా లేకపోతే వారికీ భోజనం చేసినట్టే ఉండదు. కొంతమంది పెరుగును అలాగే తినడానికి ఇష్టపడతారు. పెరుగు ఆరోగ్యానికి మంచిదే కానీ, మితంగా తీసుకుంటేనే అంటారు వైద్యనిపుణులు. అలాగే పెరుగును మజ్జిగలా చేసుకుని తాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని కూడా చెబుతారు. వేసవి కాలంలో మజ్జిగ తాగితే చాలా మంచిదని అంటారు. అయితే, పెరుగును వర్షాకాలంలో తీసుకోకూడదు అంటారు ఆయుర్వేద నిపుణులు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

పెరుగు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది  మన జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అలాగే పెరుగులో  కాల్షియం కూడా కావలసినంత ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలంగా మారుతాయి. కానీ, కొన్ని సందర్భాలలో పెరుగు తినడం హానికరమని చెబుతారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో  పెరుగు తినడం మీ ఆరోగ్యానికి చాలా హానికరమని అంటారు.  ఆయుర్వేదంలో ఇది ప్రస్ఫూటంగా  ప్రస్తావించబడింది. ఆయుర్వేదం ప్రకారం, శ్రావణ మాసం వర్షాకాలంలో పెరుగు తినడం  ప్రమాదకరమని చెబుతారు. దానికి కారణాలు కూడా వివరించారు ఆయుర్వేద నిపుణులు. దాని ప్రకారం.. వర్షాకాలంలో శరీరంలోని రంధ్రాలు మూసుకుపోతాయి. పెరుగు తీసుకుంటే అది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

వర్షాకాలంలో పెరుగు తిన్న తర్వాత గొంతులో చిక్కుకున్నట్లు అనిపిస్తే, మీ శరీరం పెరుగు తినడం ఇష్టపడలేదని అర్థం చేసుకోండి. శరీరం ఈ సంకేతాన్ని విస్మరించి మీరు పెరుగు తినడం కొనసాగిస్తే, మీరు శరీరంలో తీవ్రమైన నొప్పి, జీర్ణక్రియలో ఇబ్బంది లేదా జ్వరం వంటి పరిస్థితిని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు

  • ఒళ్ళు నొప్పులు
  • గొంతు సమస్య
  • జీర్ణక్రియ సమస్య
  • గొంతులో దగ్గు
  • దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు కూడా బయటకు వస్తాయి.

ఉల్లిపాయ, పెరుగు కలిసి: పెరుగుతో ఉల్లిపాయను ఎప్పుడూ తినకండి, ఇది ఆరోగ్యానికి అన్ని విధాలుగా హానికరం అంటోంది ఆయుర్వేదం

Also Read: Hair Falling Prevention: జుట్టు ఎక్కువగా రాలిపోతోందా? షాంపూ చేసే విధానం మార్చుకోండి..ఎలాగంటే..

గర్భధారణ సమయంలో ఛాతి నొప్పి వస్తోందా.? అయితే నిర్లక్ష్యం చేయకండి.! ఇది తెలుసుకోండి..