
సంపూర్ణ ఆరోగ్యానికి ఆహారంతో పాటు పండ్లు కూడా ముఖ్యం. అందుకే వైద్యులు సైతం ఎప్పుడూ తాజా పండ్లను తినమని సూచిస్తుంటారు. అన్ని సీజన్‌తో పనిలేకుండా లభించే పండ్లు కొన్నైతే.. సీజనల్‌గా లభించే పండ్లు మరికొన్ని ఉంటాయి. మార్కెట్లో మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. అరటి, యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి, నేరేడు, సపోటా, సీతాఫలం, జామ ఇలా చెప్పుకుంటూ పోతే..లెక్కలెనన్నీ పండ్ల రకాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా రకాల విదేశీ పండ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి మన దేశీ పండ్లతో పోలిస్తే కాస్త ధర ఎక్కువగానే ఉంటున్నాయి. కానీ, అన్ని కాలాల్లో, అందరికీ అందుబాటులో ఉండే ఒక అద్భుత ఫలం ఉంది.. దానిని పేదవాడి యాపిల్ గా పరిగణిస్తారు. ఎందుకంటే.. యాపిల్ పండులో ఉండే చాలా పోషకాలు ఈ పండులో కూడా ఉంటాయి. ఇంతకీ ఆ పండు ఏంటి..? దాని ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఖరీదైన యాపిల్ పండ్లు కొని తినలేని పేదవారికి అంతే పోషకాలు అందించే పండు జామ పండు.. అందుకే దీనికి పేదవాడి యాపిల్ అనే పేరు వచ్చింది. జామ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా జామ పండును తింటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. రోజు ఒక జామపండు తింటే బోలెడు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయిన ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన విటమిన్ సి సైతం జామకాయలో ఉంటుంది. జామకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.
జామకాయలోని పొటాషియం, కరిగే ఫైబర్ రక్తపోటును నియంత్రించడానికి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో జామకాయ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జామకాయలోని అధిక ఫైబర్ కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. జామకాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి