
చలికాలం వచ్చిందంటే చాలా మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీని కారణంగా మనం త్వరగా అనారోగ్యానికి గురవుతూ ఉంటాం. ముఖ్యం ఈ కాలంలో సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, జ్వంరం జనాలను తీవ్రంగ ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే ఈ సీజన్‌లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో మన రోగనిరోధక శక్తిని పెంచడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనెను తీకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా శీతాకాలంలో రాత్రి పడుకునే ముందు తేసి తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
పడుకునే ముందు ఒక చెంచా తేనె తింటే ఏమవుతుంది?
మంచి నిద్ర: తేనెలో గ్లూకోజ్ ఉంటుంది, ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉత్పత్తిని కూడా పెంచుతుంది, ఇది శరీరంలో సెరోటోనిన్ ,మెలటోనిన్‌గా మారుతుంది. ఈ రెండు మన నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనె తినడం మంచి నిద్రకు సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి: తేనెలో సహజ యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తేనెలో విటమిన్ సి, జింక్‌లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా రోగనిరోధక శక్తిని పెంచి మనకు బలాన్ని అందిస్తాయి. అలానే సీజనల్ వ్యాధుల భారీ నుంచి మనను రక్షిస్తాయి.
గొంతు నొప్పి నుండి ఉపశమనం: శీతాకాలంలో గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు రావడం కామన్. అలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనె తినడం వల్ల గొంతు నొప్పి, దగ్గు తగ్గుతుంది. మీకు ఏవైనా శ్వాసకోశ సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది, ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
మెరిసే చర్మం: తేనెలో విటమిన్ E యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి పొడిబారడాన్ని తొలగించి చర్మాన్ని తేమగా ఉంచుతాయి. దీని వల్ల మీ చర్మం ప్రకాశవంతగా మారుతుంది. అలాగే, తేనె తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అలాగే ఇది వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది. ఇది చర్మ రంగును మెరుగుపరుస్తుంది, వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది.
గుండె ఆరోగ్యం: తేనెలో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు ఆరోగ్యకరమైన రక్త నాళాలను నిర్వహించడానికి, రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతాయి. శీతాకాలంలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తేనె తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
తేనెను ఎవరు తినకూడదు?
అయితే తేనె తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి.. కొందరికి మాత్రం ఇది అస్సలు మంచింది కాదు. ఎందుకంటే అలాంటి వారు తేనె తినడం వల్ల అనారోగ్య సమ్యలను ఎదుర్కోవచ్చు. ఏడాదిలోపు పిల్లలకు తేనె ఇవ్వడం మంచిది కాదు. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు తేనెను జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే తేనెలో రక్తంలో చక్కెరను పెంచే సహజ చక్కెరలు ఉంటాయి. అంతేకాకుండా, అలెర్జీలు ఉన్నవారు తేనెను తినకూడదు. వైద్యుడు లేదా పోషకాహార నిపుణుల సలహా మేరకు మాత్రమే తేనెను తీసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.