Masala Roti: రొటీన్ చపాతీలు బోర్ కొట్టాయా? ఒక్కసారి ఈ మసాలా రోటి” ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్ అంతే!

Suji Masala Roti Recipe: మన భారతీయ వంటకాల్లో రైస్‌తో పాటు చపాతీలు కూడా ఎంతో కీలక పాత్రను పోషిస్తాయి. చాలా మంది రాత్రి భోజనంలోకి లేదా ఈవినింగ్ స్నాక్స్‌లోకి చపాతీలను తింటూ ఉంటారు. అలాగే బరువు తగ్గాలని ప్రయత్నించే వారు కూడా రైస్ తినడం మానేసి చపాతీలను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఎప్పుడూ ఒకేలా రకమైన చపాతీలు కొందరికి బోర్ కొట్టవచ్చు. కాబట్టి ఇప్పుడు స్పైసీ అండ్, టేస్టీగా ఉండే మసాలా చపాతీలను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

Masala Roti: రొటీన్ చపాతీలు బోర్ కొట్టాయా? ఒక్కసారి ఈ మసాలా రోటి ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్ అంతే!
Masala Roti Recipe

Updated on: Feb 26, 2026 | 4:30 PM

సాదారణంగా ప్రతి ఇంట్లో, హోటల్లో ఎక్కడ చూసినా మనకు ఒకే రకమైన చపాతీలు కనిపిస్తాయి. తరచూ వీటినే తినడం మనకు బోర్‌ కొట్టవచ్చు. మీకూ అలానే అనిపిస్తే. ఇప్పుడు మేం చెప్పబోయే ఈ కొత్త రెసిపీని ట్రైం చేయండి. దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే మీరు మళ్లీ మళ్లి ఇలాంటి చపాతీనే కావాలి అంటారు. అదే సూజీ మసాలా రోటీ. దీని తయారు చేసేందుకు మనకు ఖరీదైన ఇంగ్రీడియెంట్స్ ఏమి అవసరం లేదు. జస్ట్ గోదుమ పిండి, కొన్ని మసాలా దినుసులు ఉంటే సరిపోతుంది. ఈ చపాతీని ఊరగాయ లేదా పెరుగుతో కలిపి తింటే రుచి అదిరిపోతుంది అంతే. కాబట్టి దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మసాలా రోటీ తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు

3/4 కప్పు వేడి నీరు, 2 ఉడికించిన బంగాళాదుంపలు, 1/2 కప్పు గోధుమ పిండి, 1 టీస్పూన్ ఎర్ర కారం పొడి, 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ క్యారమ్ విత్తనాలు, 1 టీస్పూన్ జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు ఇంగువ, 1 టీస్పూన్ కసూరి మేథి, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులు (సన్నగా తరిగినవి), 1 టీస్పూన్ నూనె ఇంటి ఉంటే సరిపోతుంది.

మసాలా రోటీ ఎలా తయారు చేయాలి

  • మసాలా రోటీ తయారు చేసేందుకు ముందుగా, ఒక పెద్ద గిన్నెలోకి బొంబాయి రవ్వను తీసుకొని దాన్ని జల్లెడ పట్టండి.
  • ఇప్పుడు దాంట్లో వేడి నీళ్ళు పోసి బాగా కలపండి. నీళ్లు పోసిన తర్వాత, గిన్నెను మూతపెట్టి 5-6 నిమిషాలు అలాగే ఉంచండి.
  • తరువాత గోధుమ పిండి, ఉడికించిన మెత్తని బంగాళాదుంపలు, అన్ని సుగంధ ద్రవ్యాలు, కొత్తిమీర, నూనె వేసి దాన్ని కలపండి.
  • ఇప్పుడు అన్నింటినీ కలిపి మెత్తని పిండిలా పిసికి ముద్దగా చేసుకొండి. దాన్ని ఒక పాత్రలో ఉంచి మూతపెట్టి 5-6 నిమిషాలు అలాగే ఉంచండి.
  • ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీలా రుద్దండి
  • పాన్ వేడి చేసి గ్యాస్ మీడియం మీద ఉంచి, రోటీని రెండు వైపులా బాగా కాల్చండి.
  • అంతే మీకు వేడి వేడి, టేస్టీ టేస్టీ మసాలా రోటీ రెడీ అయినట్టే
  • దాన్ని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని పెరుగు లేదా, అవకాయతో లేదా ఏదైనా కర్రీతో కలిపి తినండి. మళ్లీ మళ్లీ ఇదే కావాలి అంటారు.

Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. 

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us