Diabetes Control: ఈ డ్రింక్స్ తాగితే ఇన్సులిన్ తీసుకోకుండానే షుగర్ కంట్రోల్..

|

Jul 10, 2024 | 5:05 PM

డయాబెటీస్‌తో బాధ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతూనే ఉంటుంది. జీవితంలో ఒక్కసారి షుగర్ వచ్చిందంటే.. కంట్రోల్ చేసుకోవడం తప్ప అస్సలు తగ్గదు. షుగర్ ఉన్నవాళ్లు ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం. సాధారణంగా షుగర్ లెవల్స్‌ బట్టి ట్యాబ్లెట్స్ లేదా ఇన్సులిన్ సూచిస్తారు. ఆహారం సరిగ్గా తీసుకుంటూ ఉంటే షుగర్‌ని కంట్రోల్‌లో ఉంటుంది. లేదంటే ప్రాణాలకే..

Diabetes Control: ఈ డ్రింక్స్ తాగితే ఇన్సులిన్ తీసుకోకుండానే షుగర్ కంట్రోల్..
Diabetes
Follow us on

డయాబెటీస్‌తో బాధ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతూనే ఉంటుంది. జీవితంలో ఒక్కసారి షుగర్ వచ్చిందంటే.. కంట్రోల్ చేసుకోవడం తప్ప అస్సలు తగ్గదు. షుగర్ ఉన్నవాళ్లు ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం. సాధారణంగా షుగర్ లెవల్స్‌ బట్టి ట్యాబ్లెట్స్ లేదా ఇన్సులిన్ సూచిస్తారు. ఆహారం సరిగ్గా తీసుకుంటూ ఉంటే షుగర్‌ని కంట్రోల్‌లో ఉంటుంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. షుగర్ ఉన్నవారు ప్రతి రోజూ ఇప్పుడు చెప్పే డ్రింక్స్ తీసుకుంటే.. డయాబెటీస్ అనేది కంట్రోల్‌‌లో ఉంటుంది. అప్పుడు ఇన్సులిన్ అవసరం లేదు. మరి ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయ నీళ్లు:

ప్రతి రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చటి నీటిలో నిమ్మకాయ పిండి తీసుకుంటే.. షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిది. ఈ నీటిని తాగడం వల్ల ఎనర్జిటిక్‌గా ఉంటారు. జీర్ణ క్రియను మెరుగు పరిచి.. షుగర్ లెవల్స్ పెరగకుండా చూస్తుంది. నిమ్మకాయ నీటిలో తేనె కలుపుకుని తాగవచ్చు.

మెంతి నీళ్లు:

మెంతుల గురించి అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెంతి నీరు అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. షుగర్ పేషెంట్స్ మెంతి నీరు తీసుకుంటే బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. రాత్రంతా మెంతి గింజల్ని నీటిలో నానబెట్టి.. ఉదయం వాటిని నీళ్లతో సహా తాగేయాలి. ఇలా తరచూ చేస్తే షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

వెజిటేబుల్ జ్యూస్:

పాల కూర, కీర దోశ, క్యారెట్, బీట్ రూట్ కలిపి చేసిన జ్యూస్ తాగితే డయాబెటీస్‌ను ఇన్సులిన్ అవసరం లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి రోజూ తాగితే.. షుగర్‌కి ప్రత్యేకంగా ట్యాబ్లెట్స్ వాడాల్సిన పని లేదు.

దాల్చిన చెక్క టీ:

దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క టీతో షుగర్‌ను సైతం కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ పేషెంట్స్ సాధారణ టీ కంటే ఈ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..