
సాధారణంగా అప్పుడప్పుడు చెవి నొప్పులు రావడం సహజం. దీనికి ఇంట్లోని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి మరింత తీవ్రంగా నొప్పి వస్తుంది. మాట్లాడాలన్నా.. తినాలన్నా బాగా నొప్పిగా ఉంటుంది. చెవిలో రింగింగ్ అనే సౌండ్ కూడా వస్తుంది. ఇలా ఉందంటే మీ చెవి ఇన్‌ఫెక్షన్‌కు గురైందని అర్థం చేసుకోవాలి. చెవిలోని బ్యాక్టీరియా బాగా చేరడం వల్ల ఇన్‌ఫెక్షన్ కు గురవుతుంది. దీన్ని ముందుగానే పసిగట్టి.. ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. చెవి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే.. ముందు చేతులను శఉభ్రంగా ఉంచాలి. చేతుల ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లు అనేవి ఎక్కువగా వ్యాపిస్తాయి. ముక్కు, నోటిని తాగిన తర్వాత చేతులను సబ్బుతో కడగాలి.
2. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కను టిష్యూతో కప్పండి. లేదా చేతిని అడ్డం పెట్టండి. ఆ తర్వాత శుభ్రంగా చేతులు కడగాలి.
3. ధూమపానం వల్ల కూడా చెవి నొప్పి వస్తుంది. ధూమపానం చేయడం వల్ల యూస్టేషియన్ ట్యూబ్‌లను చికాకు పెడతాయి. దీంతో ఇవి ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి.
4. పిల్లలకు న్యూమోకాకల్ టీకా వేయించాలి. దీని వల్ల చెవి నొప్పి తగ్గుతుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్లు రాకుండ చేస్తుంది.
5. చిన్న పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. ఈ బ్రెస్ట్ మిల్క్ లో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. దీని వల్ల చెవి ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
* చెవులను ఎప్పుడూ వెచ్చగా ఉంచాలి. వెచ్చగా ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్లు అనేవి రాకుండా ఉంటాయి. వైరస్, బ్యాక్టీరియాలు చల్లని వాతావరణంలో ఉండటం వల్ల బాగా వృద్ధి చెందుతాయి.
* చెవి ఇన్ ఫెక్షన్ తగ్గించడానికి ఇయర్ డ్రాప్స్ చక్కగా పని చేస్తాయి. ఇవి నొప్పి, ఇన్ ఫెక్షన్ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఐబుప్రోఫెన్ లేదా అసిటమినోఫెన్ వంటి మందులు నొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి.
NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..