Ishu Yadav Sucess Story: కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి.. కష్టపడండి.. అబ్దుల్ కాలం చెప్పిన ఈ మాటలు ఆ అమ్మాయికి సరిగ్గా సరిపోతాయి. చిన్నప్పటి నుండి, అమరవీరుల కథలు వినడం చాలా ఇష్టం. గ్రామంలోని అమరవీరుల విగ్రహాలను చూసి సైన్యంలో చేరాలనే కోరిక తన మనసులో మెదిలింది.. వెంటనే తన ఫ్యామిలీకి తన కోరికను చెప్పింది ఆ అమ్మాయి. మనసులో దృఢ సంకల్పం ఉంటే ఏ పనీ కష్టం కాదు. రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలోని నవత గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఇషు యాదవ్ ఈరోజు అనేక మంది యువతకు స్పూర్తిగా నిలిచింది.
ఇషు యాదవ్ మిలటరీ నర్సింగ్ సర్వీస్‌లో లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యింది. తన గ్రామం నుండి ఈ పదవిని పొందిన మొదటి అమ్మాయిగా నిలిచింది. పరీక్షలో 17వ ర్యాంక్ సాధించింది. త్వరలో ఇషు యాదవ్ లక్నోలో శిక్షణ తీసుకోబోతుంది.
తాతయ్యకు మనవరాలిని డాక్టర్ గా చూడాలని కోరిక:
రాజస్థాన్‌లోని షెకావతి ఆర్మీలో చేరేందుకు యువత ఉత్సాహం పడుతుంటారు. ఇషు గ్రామానికి చెందిన చాలా మంది సైన్యంలో ఉన్నారు. అయితే ఇషు తాతయ్యకి తన మనవరాలు డాక్టర్లు కావాలని కోరిక. దీంతో ఇషు జీవశాస్త్రంతో 12వ తరగతిని పూర్తి చేసింది. అయితే ఇషుకి చిన్నప్పటి నుండి, అమరవీరుల గాథలను వినడం చాలా ఇష్టం. గ్రామంలోని అమరవీరుల విగ్రహాలను చూసి సైన్యంలో చేరాలనే కోరిక తన మనసులో మెదిలిందని, కుటుంబసభ్యుల ముందు తన కోరికను వ్యక్తం చేసింది.
లెఫ్టినెంట్ స్థాయికి ప్రయాణం:
లెఫ్టినెంట్ స్థాయికి చేరుకోవడాబికి ఇషు యాదవ్ కు ఎంతో కష్టపడింది. ముందు నీట్‌కు సిద్ధమయింది. అయితే ఈ పరీక్షలో ఫెయిలయింది. అయితే నిరస చెందకుండా తన దృష్టిని భారత సైన్యం వైపు మళ్లించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. అయితే, కష్టాలు ఇషుని ఇక్కడ కూడా వదిలిపెట్టలేదు. శారీరక పరీక్షలో ఇషు బరువు 27 కిలోలు ఎక్కువగా ఉంది. అధిక బరువు తగ్గించుకుని కష్టపడి ఫిట్ నెస్ పరీక్షలో విజయం సాధించింది.
బరువు ఎలా తగ్గిందంటే..
ఇషు బరువు 79 కిలోలు ఉంది, ఆర్మీలో చేరాలంటే.. దాదాపు 27 కిలోలు తగ్గాల్సి వచ్చింది. తక్కువ సమయంలో బరువు ఎలా తగ్గాలని ఇషు సహా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. అయినప్పటికీ..ఇషు నిరస చెందకుండా పట్టుదలతో తన ప్రయత్నాలను కొనసాగించింది. తినే డైట్ కంట్రోల్ చేసుకుంది. అంతేకాదు శరీరక శ్రమ, వ్యాయామం, యోగాను ఆశ్రయించింది. గ్రామంలోని సిద్ధ బాబా గుడి మెట్లు ఎక్కడం, దిగడం ప్రారంభించింది. ఈ ఆలయంలో 880 మెట్లు ఉన్నాయి. అంతేకాదు ఇషు రోజూ 10 కిలోమీటర్లు పరిగెత్తేది. ఈ సమయంలో ఇషు రివ్యూ అవకాశం కోసం మరో 40 రోజులు గడువు తీసుకుంది. కఠోర శ్రమతో కేవలం 80 రోజుల్లోనే ఇషు 27 కిలోల బరువు తగ్గింది. అనంతరం మిలటరీ నర్సింగ్ సర్వీస్‌లో లెఫ్టినెంట్‌గా ఎంపికైంది. సైన్యంలో ఇషు ఎంపికైన ఆనందంతో గ్రామం మొత్తం విజయోత్సవ యాత్రను చేపట్టింది. ఇషు పట్టుదల నేటి యువతకు ఆదర్శం.
Also Read: ఒమిక్రాన్ తో మరిన్ని కొత్త వెరియంట్స్.. నిపుణుల హెచ్చరిక ఇదీ..పూర్తి వివరాలు..