
ఎండ వేడికి మేకప్ కరిగిపోవడం ఒక ఎత్తు అయితే, స్కాల్ప్ దెబ్బతినడం మరో ఎత్తు. మనం ముఖానికి సన్‌స్క్రీన్ రాస్తాం కానీ, నేరుగా ఎండ తగిలే తల భాగాన్ని గాలికొదిలేస్తాం. ఇది జుట్టులోని సహజ తేమను లాగేసి, వెంట్రుకలను పెళుసుగా మారుస్తుంది. జుట్టు రాలడాన్ని అరికట్టి, కుదుళ్లను బలోపేతం చేయడానికి సరైన ఆహారం, సరైన వాషింగ్ పద్ధతులు, హైడ్రేషన్ ఎంత ముఖ్యమో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
1. జుట్టుకు కూడా SPF అవసరమే!
చర్మం లాగే జుట్టు కూడా ఎండకు దెబ్బతింటుంది. బయటకు వెళ్ళేటప్పుడు కాటన్ టోపీ లేదా వెడల్పాటి హ్యాట్ ధరించండి. ఇది కుదుళ్లను నేరుగా ఎండ తగలకుండా కాపాడుతుంది. లేదా UV ప్రొటెక్షన్ ఉన్న హెయిర్ సీరమ్స్ వాడండి.
2. తల స్నానం పద్ధతి మార్చండి:
చెమట, ధూళి వల్ల జుట్టు కుదుళ్లు మూసుకుపోయి ఇన్ఫ్లమేషన్ రావొచ్చు. వారానికి 2 నుండి 3 సార్లు సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూతో తల స్నానం చేయండి. స్విమ్మింగ్ చేసిన వెంటనే క్లోరిన్ నీటిని కడిగేయడం అస్సలు మర్చిపోవద్దు.
3. హీట్ టూల్స్‌కు దూరంగా ఉండండి:
బయట ఎండ జుట్టును ఇప్పటికే వేడి చేస్తోంది, దానికి తోడు స్ట్రెయిట్నర్లు లేదా హెయిర్ డ్రైయర్లు వాడితే జుట్టు పూర్తిగా నిర్జీవంగా మారుతుంది. వేసవిలో జుట్టును సహజంగానే ఆరనివ్వండి. తప్పనిసరైతే లో-హీట్ సెట్టింగ్, హీట్ ప్రొటెక్టెంట్ సీరమ్ వాడండి.
4. హైడ్రేషన్ – లోపల, బయట:
శరీరంలో నీరు తగ్గితే జుట్టు కుదుళ్లకు అందే తేమ ఆగిపోతుంది. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగండి. బయటి నుండి తేమ కోసం కలబంద (Aloe Vera) జెల్‌ను కుదుళ్లకు మసాజ్ చేయడం లేదా స్నానానికి ముందు కొబ్బరి నూనె రాయడం వంటివి చేయండి.
5. జుట్టుకు బలాన్నిచ్చే ఆహారం:
జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. పుచ్చకాయ, దోసకాయ వంటి చలవ చేసే పండ్లతో పాటు ఐరన్, జింక్ అధికంగా ఉండే వాల్‌నట్స్, బాదం పప్పులను మీ డైట్‌లో చేర్చుకోండి. మీరు తినే ఆహారమే మీ జుట్టు ఆరోగ్యానికి మూలం.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. జుట్టు విపరీతంగా రాలుతుంటే లేదా స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు ఉంటే వెంటనే ట్రైకాలజిస్ట్ (Trichologist) లేదా చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.