
నిరంతరం ఆలస్యంగా మేల్కొని ఉండటం కేవలం రోజువారీ అలవాటు మాత్రమే కాదు ఇది శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటైన విటమిన్ డి స్థాయిలను తగ్గిస్తుందని ఒక అధ్యయనం సూచిస్తోంది. చర్మం సూర్యరశ్మికి గురైనప్పుడు సహజంగా ఉత్పత్తి అయ్యే ఈ హార్మోన్ లాంటి విటమిన్, రోగనిరోధక శక్తి, మానసిక స్థితి, ఎముకల బలం, జీవక్రియ సమతుల్యత వరకు ప్రతిదానిపై ప్రభావం చూపుతుంది.
భువనేశ్వర్‌లోని మణిపాల్ హాస్పిటల్‌కు చెందిన ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రదీప్ నారాయణ్ సాహూ ఈ అంశంపై కీలక విషయాలు తెలిపారు. ‘‘చాలా ఆలస్యంగా మేల్కొని ఉండటం అంటే విటమిన్ డి తయారీకి అవసరమైన UVB కిరణాల సరైన సమతుల్యతను కోల్పోవడమే’’ అని డాక్టర్ సాహూ వివరించారు. సూర్యరశ్మి సరైన సమయంలో శరీరానికి తగలకపోవడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి తగ్గిపోతుంది.
విటమిన్ డి లోపం సాధారణ లక్షణాలు ఇవే..
మంగళూరులోని KMC హాస్పిటల్‌కు చెందిన కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ సురేంద్ర యు. కామత్.. ఈ విటమిన్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విటమిన్ డి.. బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలను నిర్వహించడానికి అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్ శోషణను నియంత్రిస్తుంది.
ఆలస్యంగా మేల్కొనడం చెడ్డ ఆలోచనగా అనిపించకపోయినా, కాలక్రమేణా ఇది విటమిన్ డి ఉత్పత్తి చేసే శరీరం యొక్క సహజ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, విటమిన్ డి లోపాన్ని నివారించడానికి ఈ చిన్న చిట్కాలు పాటించాలి:
ఉదయం నడక: మేల్కొన్న వెంటనే 10-15 నిమిషాలు ఉదయం నడక చేయడం అలవాటు చేసుకోండి.
ఆహారం: గుడ్లు, కొవ్వు చేపలు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను మీ డైట్‌లో చేర్చండి.
క్రమం తప్పకుండా పగటిపూట గడపడం, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి, ఎముకల బలం, శక్తి స్థాయిలు, మానసిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.