
జుట్టు రాలడం, నిస్తేజంగా కనిపించడం ఎవరినైనా ఒత్తిడికి గురిచేసే రెండు ప్రధాన సమస్యలు. ఈ సమస్యలను దూరం చేసుకోవడానికి చాలా మంది హెయిర్ సెలూన్, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతారు. కానీ మనం ఇంట్లోనే కొన్ని పండ్లతో తయారు చేసుకునే జ్యూస్ జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా మీ రంగును కూడా మెరుగుపరుస్తుంది. ఈ రసం తాగడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి, ఇది మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ జ్యూస్ తయారు చేయడానికి మూడు లేదా నాలుగు పదార్థాలను ఉపయోగిస్తారు. దీనిని ట్రిపుల్ ABC జ్యూస్ అని పిలుస్తారు.
ట్రిపుల్ ABC జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి
ఈ జ్యూస్ తయారు చేయడానికి, మీకు ఒక దానిమ్మ, ఒక ఆపిల్, ఒక ఉసిరి, బీట్‌రూట్ , క్యారెట్ అవసరం. ఈ పదార్థాలన్నింటినీ జ్యూసర్‌లో వేసి రసం తీయండి. అవసరమైతే కొద్దిగా నీరు కలపండి. ఈ జ్యూస్‌ను వడకట్టి ప్రతిరోజూ తాగడం ప్రారంభించండి. కొన్ని రోజుల్లోనే మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు.
ప్రయోజనాలు ఏమిటి?
జుట్టు త్వరగా రాలడం ఎదుర్కొంటున్న వారికి ఈ రసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాలుష్యం, దుమ్ము, సౌందర్య ఉత్పత్తులలోని రసాయనాలు, కలుషిత నీరు మన జుట్టుకు హాని కలిగిస్తున్నాయని మనం తరచుగా అనుకుంటాము, కానీ వాస్తవానికి, పోషకాలు లేకపోవడం మన జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా, పోషకాలు లేకపోవడం వల్ల చర్మం కుంగిపోతుంది, దీని వల్ల చిన్న వయస్సులోనే మన ముఖం ఎక్కువ వయస్సు ఉన్నట్టు కనిపిస్తుంది. అదే ఈ జ్యూస్‌ను రోజూ తాగితే ఆ సమస్యలన్ని తొలగిపోతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.