Stomach Problem: వేసవిలో డయేరియా సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి చిట్కాలు మీ కోసం

|

Apr 25, 2024 | 8:44 PM

ఈ సమస్య కలిగితే శరీరంలో నీటి సమస్య కూడా రావచ్చు. వేసవిలో స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా డయేరియా సమస్య వస్తుందని డైటీషియన్ మోహిని డోంగ్రే చెబుతున్నారు. అందువల్ల వేసవి సీజన్‌లో తినే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని రకాల ఇంటి నివారణలతో డయేరియా సమస్యను కూడా అధిగమించవచ్చు.

Stomach Problem: వేసవిలో డయేరియా సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి చిట్కాలు మీ కోసం
Stomach Problem In Summer
Follow us on

వేసవిలో చాలా మంది కడుపు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సీజన్‌లో గ్యాస్‌, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. చిన్న చిన్న అజాగ్రత్తలతో పొట్ట సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యల్లో ఒకటి డయేరియా సమస్య. ఈ సమస్య కలిగితే శరీరంలో నీటి సమస్య కూడా రావచ్చు. వేసవిలో స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కొన్నిసార్లు బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా డయేరియా సమస్య వస్తుందని డైటీషియన్ మోహిని డోంగ్రే చెబుతున్నారు. అందువల్ల వేసవి సీజన్‌లో తినే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని రకాల ఇంటి నివారణలతో డయేరియా సమస్యను కూడా అధిగమించవచ్చు.

నిమ్మరసం: డయేరియా సమస్యకు నిమ్మకాయ చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. నిమ్మరసాన్ని తాగడం వల్ల శరీరం కూడా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఒక నిమ్మకాయ రసం, పుదీనా కలిపిన నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మెంతులు: మెంతి గింజల్లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి డయేరియా సమస్యను దూరం చేస్తాయి. ఇందుకోసం ఒక చెంచా మెంతి గింజలను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మెంతి పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి మిక్స్ చేసి తాగాలి. దీని వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంది.

పెరుగు: పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా అతిసారంతో బాధపడేవారికి పెరుగు చాలా మేలు చేస్తుంది. ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విరేచనాలు అయినప్పుడు తేలికపాటి ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కిచ్డీలో పెరుగు వేసి తినవచ్చు.

అరటి పండు: అరటిపండులో పొటాషియం, పెక్టిన్ అనే మూలకాలు పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. విరేచనాలను దూరం చేయడంలో ఇది చాలా మేలు చేస్తుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది ప్రేగు కదలికను సరిచేస్తుంది. అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి మేలు చేసే ఎలక్ట్రోలైట్స్ కూడా అందుతాయి.

అల్లం: విరేచనాలు, ఆమ్లత్వం, ఉబ్బరం నివారించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలను నీళ్లలో వేసి మరిగించి తాగాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..