Lifestyle: కడుపులో గ్యాస్‌ ఉంటే.. శరీరంలో ఈ నొప్పులు ఉంటాయి..

|

Oct 19, 2024 | 12:13 PM

తీసుకునే ఆహారంలో మార్పులు, జీవన విధానం కారణంగా కడుపులో గ్యాస్ సంబంధిత సమస్యలు ఎక్కువుతున్నాయి. అయితే గ్యాస్ సంబందిత సమస్యలు శరీరంలో ఇతర సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ గ్యాస్ కారణంగా శరీరంలో ఏయే భాగాల్లో నొప్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: కడుపులో గ్యాస్‌ ఉంటే.. శరీరంలో ఈ నొప్పులు ఉంటాయి..
Health
Follow us on

కడుపులో గ్యాస్.. ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలో ఇదీ ఒకటి. వినడానికి చిన్న సమస్యే అయినా గ్యాస్‌ సమస్యలతో బాధపడేవారికే ఆ ఇబ్బంది ఏంటో తెలుస్తుంది. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోయినా, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఫుడ్‌ తీసుకున్నా గ్యాస్‌ ఏర్పడుతుందని తెలిసిందే. ఈ కారణంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎక్కువుతాయి.

అయితే కడుపులో గ్యాస్‌ శరీరంలో కొన్ని భాగాల్లో నొప్పులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కడపులో గ్యాంస్‌ ఉంటే శరీరంలో ఏయే భాగాల్లో నొప్పి వస్తుంది.? ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా గ్యాస్ సమస్య ఏర్పడితే.. కడుపులో నొప్పి ఉంటుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కడుపు ఎగువ, కింది భాగాల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది.

అలాగే ఈ ప్రాంతాల్లో తిమ్మిరి కలుగుతుంది. కడుపులో గ్యాస్ వల్ల తేన్పులు, కడుపు తిమ్మిరి వంటి సమస్యలన్నీ గ్యాస్ లక్షణాలుగా భావించాలి. ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇక కడుపులో గ్యాస్ సమస్య వేధిస్తుంటే తలనొప్పి కూడా తప్పదని నిపుణులు చెబుతున్నారు. కడుపు, మెదడుకు మధ్య ఉండే సంబంధం కారణంగానే తలనొప్పి వేధిస్తుందని నిపుణులు అంటున్నారు. కడుపులో గ్యాస్‌ తలపైకి చేరినప్పుడు ఈ నొప్పి వస్తుందని అంటున్నారు.

ఇక గ్యాస్‌ సమస్య కారణంగా ఛాతీలో నొప్పి కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే.. కడుపులో గ్యాస్ ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది ఛాతీలో మంటకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో గ్యాస్‌ కారణంగా.. వాంతులు, విరేచనాలు కూడా సంభవించే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

దీర్థకాలంగా గ్యాస్‌ సమస్య వేధిస్తుంటే.. జీలకర్ర నీరు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఒక గ్లాసులో టీస్పూన్‌ జీలకర్రతో పటు, ఒక చెంచా సెలెరీ, అర చెంచా సోంప్‌ వేసి నీరు పోయాలి. అనంతరం నీరు సగానికి వచ్చేంతలా బాగా కరిగించాలి. అనంతరం చల్లార్చి, వడకట్టిన తర్వాత తాగాలి. ఇలా క్రమంతప్పకుండా తీసుకుంటే జీర్న సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..