Cleaning Tips: మీ వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా? ఐతే మీరు ఇది తప్పక తెలుసుకోవాలి..!

|

Oct 25, 2023 | 7:25 AM

ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుండి మురికిని సులభంగా తొలగించడానికి వేడి నీరు, సబ్సు సరిపోతుంది. ఎక్కువ రోజులు వాడిన తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్‌పై పేరుకుపోయిన ఆయిల్‌, జిడ్డు, మురికి భయంకరంగా కనిపిస్తుంది. దీన్ని సులభంగా తొలగించడానికి కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇలా చేస్తే మీ వంటింట్లో ఉన్న పాత ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా తిరిగి కొత్తదానిలా కనిపిస్తుంది.  మీరు చేయాల్సిందల్లా సాధారణ

Cleaning Tips: మీ వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా? ఐతే మీరు ఇది తప్పక తెలుసుకోవాలి..!
Exhaust Fan
Follow us on

చాలా ఇళ్లలో వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ల పని లోపల నుండి పొగ, గాలిని తొలగించడం. దీంతో ఇంటి లోపల వంట చేయడం వల్ల వచ్చే పొగ, వేడి, వాసన అన్నీ తొలగిపోతాయి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేని ఇళ్లలో, వంట చేస్తున్నప్పుడు వచ్చే పొగ, వేడి, వాసనలు అన్నీ ఇంట్లోనే ఉండిపోతుంటాయి.. ఈ కారణంగా చాలామంది వంట గదుల్లో చిమ్నీలు, ఎగ్సాస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకుంటుంటారు. కానీ, ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కొద్ది రోజుల తర్వాత మురికిగా మారుతుంది. క్లీనింగ్ చేయటం కూడా చాలా కష్టతరంగా మారుతుంది. ఏది ఏమైనప్పటికీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్ మురికిగా ఉంటే, దానిని శుభ్రం చేయడానికి ఇక్కడ నాలుగు ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి.

ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుండి మురికిని సులభంగా తొలగించడానికి వేడి నీరు, సబ్సు సరిపోతుంది. ఎక్కువ రోజులు వాడిన తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్‌పై పేరుకుపోయిన ఆయిల్‌, జిడ్డు, మురికి భయంకరంగా కనిపిస్తుంది. దీన్ని సులభంగా తొలగించడానికి కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇలా చేస్తే మీ వంటింట్లో ఉన్న పాత ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా తిరిగి కొత్తదానిలా కనిపిస్తుంది.  మీరు చేయాల్సిందల్లా సాధారణ డిష్వాషింగ్ సబ్బును ఉపయోగించడం. సబ్బు, గోరువెచ్చని నీటితో కలిపి అందులో ముంచిన ఒక మెత్తటి క్లాత్‌తో ఫ్యాన్‌ను పూర్తిగా తుడవాలి.. ఆ తర్వాత మరొక తడి, శుభ్రమైన క్లాత్‌ తీసుకుని తుడవండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని శుభ్రపరిచే ముందు స్విచ్ ఆఫ్ చేసి, అన్‌ప్లగ్ చేయాలని గుర్తుంచుకోండి.

బేకింగ్ సోడాను బాగా మురికిగా ఉన్న ఫ్యాన్‌ను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. ముందుగా తడి గుడ్డతో దుమ్ము తుడవండి. తర్వాత ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి ఫ్యాన్ మొత్తం తుడవాలి… ఐదు నుంచి పది నిమిషాల తర్వాత పొడి క్లాత్‌ తీసుకుని గట్టిగా తుడిచేస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను శుభ్రం చేయడానికి నిమ్మరసం కూడా ఉపయోగించవచ్చు. ఒక కప్పు వేడి నీటిలో కొంచెం నిమ్మరసం కలపండి. ముందుగా ఫ్యాన్‌ని తుడిచి, ఆపై తయారు చేసిన మిశ్రమంలో తడి గుడ్డను ముంచి, మళ్లీ ఫ్యాన్‌ను బాగా తుడవండి.

ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను శుభ్రం చేయడానికి వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. ఫ్యాన్‌ను వెనిగర్, నీరు కలిపిన మిశ్రమంలో ఒక మెత్తటి క్లాత్‌ని ముంచి దాంతో శుభ్రం చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్యాన్‌కు తడి గుడ్డతో అప్లై చేసి, ఆపై పొడిగా ఉన్న మరొక గుడ్డతో శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోని ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ కొత్తదానిలా కనిపిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..